
ఎండ.. జాగ్రత్తలే అండ..!
ఇంటి మొక్కలు జర జాగ్రత్త
వాహనాలకూ ఇబ్బందే..
బైక్‌లు, కార్లు ఎండలో నిలిపితే సూర్య కిరణాలు నేరుగా వాటిపైపడి కొద్ది కాలంలోనే రంగు వెలసిపోతుంది. తప్పనిసరిగా వాటిపై టార్పాలిన్ కవర్లు కప్పాలి. పెట్రోల్ ట్యాంక్ త్వరగా వేడెక్కి ఇంధనం ఆవిరయ్యే అవకాశం ఉంది. ఉదయం 8 లోపు, సాయంత్రం 6 గంటల తరువాత వాహనాల్లో ఇంధనం పోయించడం మంచిది. గ్యాస్‌కిట్లను ఉపయోగించే కార్ల యజమానులు అప్రమత్తంగా ఉండాలి. గ్యాస్ ట్యాంక్‌పై మందంగా ఉన్న వస్త్రం లేదా గోనె సంచి కప్పి ఉంచడం వలన గ్యాస్ లీక్ కాకుండా ఉంటుంది. ఎండలో ఎక్కువ సమయం వాహనాలు నిలపడం వల్ల రేడియేటర్ హెడ్ గ్యాస్ కట్ అయ్యే అవకాశముంది. ట్రాఫిక్ జాం అయినప్పుడు సిగ్నల్స్ వద్ద కార్లలో ఏసీ వేయవద్దు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు వాహనాలకు విశ్రాంతి ఇవ్వాలి.– చెలిమల చంద్రమౌళి,
మెకానిక్, మంచిర్యాల
ఎలక్ట్రిక్ బైక్‌లు హీట్ కానివ్వొద్దు
● ఎలక్ట్రిక్ బైక్‌ను వారానికోసారి శుభ్రం చేసి ఇంజన్, చైన్‌లలోని దుమ్ము, ధూళిని తొలగిస్తే ఇంజన్ సామర్థ్యం తగ్గకుండా ఉంటుంది.
● ఈవీ బైక్ ఎంత బరువు మోయగలదో అంతే బరువుతో ప్రయాణించాలి.
● ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు, ఎక్కడైనా ఆగినప్పుడు ఇంజన్ ఆఫ్ చేయాలి. దీని వల్ల పవర్ ఆదాతో పాటు, లైఫ్ పెరుగుతుంది.
● ఈవీ బైక్‌లు లైట్ వెయిట్ ఉండడం వల్ల టైర్‌లో ఎంత ప్రెజర్ ఉందో తెలియదు. దానిని పట్టించుకోకుండా దీర్ఘకాలంపాటు ప్రయాణాలు చేస్తే ఇంజన్‌పై దుష్ప్రభావం పడుతుంది.
● ఈవీ బైక్‌ను చార్జింగ్ పూర్తయిన వెంటనే ప్లగ్‌ను తీసేయాలి. ఓవర్‌హీట్ అయితే బైక్‌లు దగ్ధమయ్యే అవకాశం ఉంది.
జాగ్రత్తలు పాటించాలి
ఎండలో తిరగడం, వడగాలులతో వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. చిన్నారులు, వృద్ధులు త్వరగా డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశముంది. తగు జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బ బారిన పడకుండా ఉండవచ్చు. పనుల కోసం బయటకు వెళ్లేవారు ఉదయం 10 లోపు, సాయత్రం 6గంటల తర్వాతే వెళ్లాలి. అత్యవసర పరిస్థితుల్లో గొడుగు, నెత్తికి టోపి, రుమాలు ధరించాలి. వదులుగా ఉండే తెలుపురంగు గల కాటన్ దుస్తులు ధరించాలి. తరచూ నీటిని తాగుతుండాలి. ఉప్పు కలిపిన నిమ్మరసం, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ద్రావణం, కొబ్బరినీళ్లు, పండ్లరసాలు తాగడం శ్రేయస్కరం.
– డా.ఆడే క్రాంతికుమార్,
జనరల్ ఫిజీషియన్
వడదెబ్బ లక్షణాలు
శరీరంలో వేడి పెరగడం, తీవ్రమైన తలనొప్పి, నాడి వేగంగా కొట్టుకోవడం, నాలుక తడారిపోవడం, శరీరంలో నీటి శాతం కోల్పోవడం, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితికి చేరుకోవడం, ఫిట్స్, వాంతులు, విరేచనాలు వంటివి వడదెబ్బ లక్షణాలు. అలాంటి వారిని శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల కంటే తక్కువగా వచ్చే వరకు తడిగుడ్డతో శరీరమంతా తుడుస్తూ ఉండాలి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాలి. ముఖ్యంగా బీపీ, షుగర్ బాధితులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● ఎండలో బయటకు వెళ్లవద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సివస్తే తలపై రుమాలు లేదా టోపీ ధరించాలి.
● నీరు, ద్రవ పదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుకోవచ్చు.
● మద్యం సేవించడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.
● తప్పనిసరిగా వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి.
● ఆహారం తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవాలి.
● చిన్నారులను ఎండలో ఆడనివ్వకూడదు. ఇంటి ఆవరణలో, చెట్ల నీడలో ఆడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత భగ్గుమంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్‌లోనే పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరడంతో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుంచే భానుడి భగభగలతో వేడి పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవసాయ కూలీలు, చిరు వ్యాపారులు ఇతరత్రా అత్యవసర పనుల్లో బయటకు వెళ్లక తప్పని పరిస్థితి. అధిక వేడి కారణంగా శరీరం నీరసంగా, నిస్సత్తువుగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలను పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ఉండేవారు సైతం తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
– కై లాస్‌నగర్/మంచిర్యాలటౌన్/నిర్మల్ చైన్‌గేట్
● కూలర్లలో నీళ్లు పోశాక అటూ ఇటు కదల్చ కూడదు.
● ఓపెన్ గదిలో వాడడంతో పాటు, గాలి ప్రవాహం ఉండేలా చూడాలి.
● కూలర్‌కు చల్లదనాన్ని ఇచ్చే గడ్డి, హానీకాంబ్ ప్యాడ్స్, ఫిల్టర్లు శుభ్రంగా ఉంచుకోవాలి.
● సమ్మర్ సీజన్‌లో కూలర్ వినియోగించడం అయిపోయాక క్లీన్ చేసి, వాటి తడకలు వేరుచేసి జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. అలాగే ఉంచితే వచ్చే ఏడాదికి అది పాడైపోతుంది.
● కూలర్‌ను కిటికీ దగ్గర కానీ, తలుపు దగ్గర కానీ ఉంచి వినియోగిస్తేనే ఎక్కువ గాలి వీస్తుంది. అలా కాకుండా ఇంటి మధ్య భాగంలో పెడితే అనుకున్నంత గాలి రాక ఇబ్బందులు పడుతారు.
● ఏసీలు 1 టన్, 1.5 టన్, 2 టన్స్ అని మూడు రకాలుగా దొరుకుతాయి. గది చిన్నగా ఉంటే 1 టన్, మధ్యస్తంగా ఉంటే 1.5 టన్, పెద్దదిగా ఉంటే 2 టన్స్ ఏసీలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
● ఏసీ గాలి బయటకు వెళ్లకుండా గది తలుపులన్నీ మూసి ఉంచాలి
● 24 నుంచి 26 డిగ్రీలలో ఏసీని సెట్ చేసుకుంటే గది ఉష్ణోగ్రతతో చల్లగా ఉండి విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది.
● ఏడాదిలో ఒకసారి ఏసీని తప్పనిసరిగా సర్వీసింగ్ చేయించాలి.
● స్టెబిలైజర్‌ను వాడడం మంచిది.
ఫ్రిజ్ వాడకం ఇలా..
● అవసరమున్నప్పుడే ఫ్రిజ్ డోర్ తీయాలి
● వేడి పదార్థాలను ఉంచకుండా చూసుకోవాలి.
● ఫ్రిజ్ వెనక భాగం శుభ్రం చేసుకోవాలి.
● డోర్ గాస్కెట్ లీక్ ఉందో లేదో చూసుకోవాలి.
● వెనుక భాగానికి గోడకి మధ్య కాస్త గ్యాప్ ఉంచాలి.
అప్రమత్తత అవసరం
ఎండల తీవ్రత మనుషులపైనే కాదు మూగజీవా లు, పశుపక్షాదులపైనా తీవ్ర ప్రభావం చూపనుంది. అధిక వేడి కారణంగా జంతువులు ఉష్ణోగ్రతను నియంత్రించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతా యి. దీంతో ఊపిరాడక మృతి చెందే ప్రమా దం ఉంది. మూగజీవాలకు పశుగ్రాసం, నీటికొరత లేకుండా చూడాలి. ఎండలో ఎక్కువసేపు ఉంచవద్దు. వేడి తీవ్రతను అధిగమించేందుకు గోనె సంచులను తడిపి వాటిపై కప్పితే చల్ల దనం లభిస్తుంది.
– బి.కిషన్, జిల్లా పశుసంవర్దకశాఖ అధికారి, ఆదిలాబాద్
● రోజువారి వాడకానికి సరిపడా మోడ్‌ను సెలక్ట్ చేసుకోవాలి
● వేడి నీరు అవసరం లేనిదే వాడవద్దు
● ఎండలో ఉంచకుండా చూడాలి
● ఫిల్టర్లు నెలకోసారి శుభ్రం చేయాలి.
వాషింగ్ మెషీన్ వాడకం
ఇతరత్రా పరికరాలు
● టీవీని నేరుగా సూర్యకాంతికి పెట్టవద్దు. స్టెబిలైజర్ లేదా సర్జ్ ప్రొటెక్టర్‌ను వాడాలి.
● అవసరంలేని సమయాల్లో లైట్లను ఆర్పివేడయం వల్ల గదిలో వేడి తగ్గుతుంది.
● ఎల్‌ఈడీ బల్బులు వాడడం వల్ల హీట్ తక్కువగా ఉంటుంది. విద్యుత్ ఆదా అవుతుంది.
● విద్యుత్ పరికరాలు వేడి వాతావరణంలో వాడకుండా చూసుకోవాలి. వాడిన తర్వాత తప్పనిసరిగా ఆఫ్ చేయాలి.
● ఉద్యానవన శాఖ కాగజ్‌నగర్ డివిజన్ అధికారి సుప్రజ
చింతలమానెపల్లి: మార్కెట్‌లో కూరగాయల ధరలు మండుతున్నాయి. పండ్ల ధరలదీ అదే పరి స్థితి. పోషకాలతో కూడిన ఆహారం కావాలంటే పండ్లు, కూరగాయలు ఆహారంలో ఉండాల్సిందే. మరి వీటికి పరిష్కారం.. కిచెన్‌లో, ఇంటి కప్పు మీద రూఫ్‌లో, కూరగాయలు, పండ్లు, మొక్కలు పెంచుకోవడం. ఇంటిలో ఆహ్లాదకర వాతావరణం కోసం పూల మొక్కలు ఏర్పాటు చేసుకోవడం. గ్రా మాలు, పల్లెలు అనే తేడా లేకుండా పట్టణాలుగా మారుతున్న వేళ ఇరుకు ఇళ్లు, అపార్ట్‌మెంట్ సంస్కృతిలో ఈమధ్య కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెన్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. మన ప్రభుత్వం మన పట్టణ ప్రాంత ఆవాసాల్లో పోషక పదార్థాలను ఇచ్చే కూరగాయలు పెంచే పథకం ‘మన ఇల్లు–మన కూరగాయలు’ పేరిట ప్రోత్సహిస్తోంది. కానీ.. పెరిగిన ఎండల వేడికి వీటిని కాపాడుకునేందుకు ఏం చేయాలి. వేల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ అర్బన్ ప్లాంటేషన్‌ల నుంచి లబ్ధి ఎలా పొందాలి. వీటిపై సలహాలు, సూచనలు, జాగ్రత్తలు ఉద్యానవన శాఖ కాగజ్‌నగర్ డివిజన్ అధికారి సుప్రజ అందించారు.
అర్బన్ ప్లాంటేషన్, కిచెన్ గార్డెన్,
రూఫ్ గార్డెన్ అంటే వివరాలు తెలపండి?
ఈ పద్ధతిలో కూరగాయలు, పండ్లు, పూల మొక్కలను ఇంటి వద్దనే పెంచుకోవచ్చు. ప్రధానంగా పట్టణ సంస్కృతి కలిగి ఉండి, వ్యవసాయ స్థ లాలు లేని వారికి ఇది ఉపయోగంగా ఉంటుంది.
మన ప్రాంతంలో ఇవి ఉన్నాయా?
మన జిల్లాలో ఇవి తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి నగరాల్లో ఈ పద్ధతిలో సాగు చేస్తున్నారు. కానీ.. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని భవనాల్లో ఆసక్తి ఉన్న వా రు కూడా ఈ పద్ధతిలో సాగు చేస్తున్నారు. పూల మొక్కలు, పచ్చదనం కోసం విదేశీ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మొక్కలు పెంచుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల వంట నిర్వాహకులూ పోషకాలు అందించే కూరగాయలు సాగు చేస్తున్నారు.
ఈ పద్ధతిలో సాగు చేస్తే కలిగే ఉపయోగాలేవి?
ఈ పద్ధతుల్లో సాగు చేసేవారికి తాజా కూరగాయలు, పండ్లు లభిస్తాయి. ఆరోగ్య రక్షణలో వీటి పాత్ర కీలకం. ఆరోగ్య రక్షణతో పాటు సేంద్రియ ఎరువులు, కూరగాయల వ్యర్థాలను ఎరువులుగా వినియోగించుకోవచ్చు.
ఎండ వేడిమి నుంచి వీటి రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి.
మొక్కలు సాగు చేసే చోట గ్రీన్‌నెట్ షీట్స్ వినియోగించి ఎండవేడిమి నుంచి రక్షించుకోవాలి. ఇంటి దగ్గర సాగు చేసే మొక్కలను పరుచుకునేలా సాగు చేసుకోవాలి. కిచెన్‌లోని కూరగాయల వ్యర్థాలను మొక్కల వద్ద పరుచుకోవాలి. దీని ద్వారా కింద మట్టిలో ఉండే తేమను రక్షించుకోవచ్చు.
మొక్కలకు నీటిని అందించే పద్ధతులేమిటి?
ఆధునిక పరిజ్ఞానం వినియోగించే వారు ఇళ్లపై ఉండే నీళ్ల ట్యాంకులను వినియోగించి డ్రిప్ పద్ధతిలో మైక్రోజెట్‌లను ఏర్పాటు చేసుకోవాలి. ప్లాస్టిక్ సీసాలు, మట్టి కుండలు లాంటివి వినియోగించడంపై ఆన్‌లైన్‌లో చాలామంది నిపుణులు మెళకువలు తెలియజేస్తున్నారు.
ఎలాంటి మెలకువలు పాటించాలి?
మొక్కల పెంపకంలో ప్రధానంగా కొన్ని సూచనలు పాటించాలి. సూర్యరశ్మి లభ్యత, అందుబాటులో ఉన్న స్థలం, సాగునీటి లభ్యత, నీరు నిల్వ ఉంచే సామర్థ్యం (వాటర్‌ప్రూఫ్ ఇంటి కప్పు), మన అభిరుచి అవగాహన లాంటివి కీలకంగా పరిశీలించుకోవాలి.
ఎలాంటి మట్టిని వినియోగించుకోవాలి?
ఈ పద్ధతుల్లో పెంపకానికి మట్టి తయారీ కీలకంగా మారుతుంది. 20శాత ఎర్రమట్టి, 40శాతం వర్మీకంపోస్ట్, 20శాతం కొబ్బరి పీచుపొట్టు, 5శాతం వేపపిండి, 15శాతం పశువుల చివికిన ఎరువులు కలిపి తయారు చేసుకోవాలి.
ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉందా?
ప్రభుత్వం ఈ పద్ధతుల్లో పట్టణాలు, నగరాల్లో పో త్సహించడానికి ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ‘మన ఇల్లు–మన కూరగాయలు’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పద్ధతిలో శాఖ ద్వారా సలహాలు, సూచనలు అందిస్తున్నాం. ఇతర విషయాలు తెలు సుకోవాలంటే శాఖ అధికారులను సంప్రదించాలి.
కూలర్ వినియోగంలో జాగ్రత్తలు
ఏసీల వినియోగం

ఎండ.. జాగ్రత్తలే అండ..!

ఎండ.. జాగ్రత్తలే అండ..!

ఎండ.. జాగ్రత్తలే అండ..!

ఎండ.. జాగ్రత్తలే అండ..!

ఎండ.. జాగ్రత్తలే అండ..!

ఎండ.. జాగ్రత్తలే అండ..!

ఎండ.. జాగ్రత్తలే అండ..!

ఎండ.. జాగ్రత్తలే అండ..!

ఎండ.. జాగ్రత్తలే అండ..!