
కారు బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు
కడెం: మితిమీరిన వేగం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిన్నబెల్లాల్‌కు చెందిన బక్కతట్ల వెంకటేశ్ తన కారులో నేతుల వెంకటేశ్‌తో కలిసి గురువారం రాత్రి పాండ్వపూర్ వైపు నుంచి బెల్లాల్ వెళ్తుండగా పాండ్వపూర్ హనుమాన్ ఆలయ సమీపంలోని మూలమలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ప్రమాద సూచికను, విద్యుత్ స్తంభాన్ని, ఆలయం ఇనుప కంచెను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకుని ఇద్దరిని నిర్మల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.