
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
తానూరు: మండలంలోని ఉమ్రి(కే) గ్రామానికి చెందిన కదం బాలాజీ (45) అనే రైతు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై భానుప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రైతు బాలాజీ కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈసారి తనకున్న రెండెకరాల్లో వ్యయప్రయాసలకోర్చి పత్తి పంట సాగు చేశాడు. పత్తి పంట దిగుబడి సరిగా రాకపోవడంతో తీవ్రంగా మనస్తాపం చెందాడు. ఈక్రమంలో గురువారం సాయంత్రం గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ట్రెయినీ ఎస్సై నవనీత్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. శుక్రవారం బాలాజీ భార్య మోనాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెల్లడించారు. మృతుడికి కుమారుడు, కూమార్తె ఉన్నారు. కాగా గత ఆరు నెలల క్రితం కూడా బాలాజీ ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.