
● వేసవి సెలవుల్లో అవకాశాలు ● జిల్లాలో అందుబాటులో శిక్షక
ఇలా శిక్షణ పొందితే..
మంచిర్యాల పట్టణానికి చెందిన విశ్వనాథ్ రాము, జయంతి దంపతుల ఇద్దరు కూతుళ్లు అస్మిత(17), ఝాన్సీ చిన్నతనంలో చదువు అంటే భయం పడేవారు. చాలా సున్నితంగా ఉండేవారు. అందరికన్నా వెనుకబడుతున్నామనే ఆత్మన్యూనతకు లోనయ్యేవారు. దీంతో అన్నింటా రాణించడానికి తైక్వాండో శిక్షణ ఇప్పిస్తున్నారు. గత మూడేళ్లలో శారీరక దృఢత్వంతోపాటు ఆత్మవిశ్వాసం పెరిగింది. అంతేగాక ఇద్దరు చదువులోనూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ.. తైక్వాండోలో రాష్ట్రస్థాయిలో పతకాలు గెలుచుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/మంచిర్యాలటౌన్: వేసవి సెలవులు వచ్చేశాయి. స్కూళ్లు, కాలేజీల్లో పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులకు కాస్త విరామం దొరికింది. ఈ సెలవులను సద్విని యోగం చేసుకునే అవకాశం కలిగింది. బాలబాలికలు తమ అభిరుచి మేరకు ప్రావీణ్యం సాధించవచ్చు. అందుబాటులో ఉన్న శిక్షకులతో శిక్షణ పొందవచ్చు. జిల్లాలో ఆయా అసోసియేషన్ల తరఫున క్రీడాంశాల్లో శిక్షణకు అవకాశాలు కల్పిస్తున్నారు. క్రికెట్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, బేస్‌బాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ, ఖోఖో, చెస్, క్యారం, రన్నింగ్, ఫుట్‌బాల్, స్విమ్మింగ్, కరాటే, తైక్వాండోతోపాటు అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్స్, మార్షల్ ఆర్ట్స్, ప్రాచీన కళలైన కర్ర, కత్తి సాము, ముద్గర్ తదితర వంటి క్రీడాంశాలు ఉన్నాయి. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే శిక్షకుల ఏర్పాటు, తరగతుల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. వీటితోపాటు యోగ, లలిత కళలు డాన్స్, సంప్రదాయ నృత్యాలు, సంగీత వాయిద్యాలు నేర్చుకునే అవకాశం ఉంది. వేసవి శిబిరాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చా యి. ప్రభుత్వ, సింగరేణి, ప్రైవేటు అకాడమీలు ఫీజు తీసుకుని బాలబాలికలకు నేర్పిస్తున్నాయి.

● వేసవి సెలవుల్లో అవకాశాలు ● జిల్లాలో అందుబాటులో శిక్షక

● వేసవి సెలవుల్లో అవకాశాలు ● జిల్లాలో అందుబాటులో శిక్షక

● వేసవి సెలవుల్లో అవకాశాలు ● జిల్లాలో అందుబాటులో శిక్షక