
దాడికి పాల్పడ్డ ముగ్గురి అరెస్ట్
భీమిని: కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఓ వ్యక్తిపై దాడి చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసి బైండోవర్ చేసినట్లు ఎస్సై గంగారాం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. భీమిని మండలం మల్లీడి గ్రామానికి చెందిన పెద్దపల్లి ప్రశాంత్ సోమవారం కన్నెపల్లి మండలంలోని టేకులపల్లి గ్రామంలో చేపట్టిన తన ఇంటి నిర్మాణ పనుల్లో ఉన్నాడు. మల్లీడి గ్రామానికి తన బంధువులైన పెద్దపల్లి నగేశ్, పెద్దపల్లి గణేశ్, పెద్దపల్లి సురేశ్ పాతకక్షలతో ప్రశాంత్‌పై చేతులు, కర్రలతో దాడి చేశారు. ప్రశాంత్ ఫిర్యాదు మేరకు దర్యా ప్తు చేపట్టినట్లు ఎస్సై తెలి పారు. మరోసారి గొడవ పడకుండా తహసీల్దార్ శ్రవణ్‌కుమార్ ఎదుట బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.