
ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణ●
● రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మంచిర్యాలఅగ్రికల్చర్: కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించి ధాన్యం సేకరించాలని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్, పౌరసఫరాల శాఖ అధికారులతో ధాన్యం సేకరణ, సన్నబియ్యం పంపిణీ, తాగునీటి సరఫరా అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ కుమార్‌దీపక్ నిర్మల్ కలెక్టరేట్ నుంచి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3,31,935 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశామని, ఇప్పటి వరకు 209 కొనుగోలు కేంర్రాలు ప్రారంభించామన్నారు. ఈ నెల 17 వరకు 337 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.