
దేశీదారు విక్రయిస్తున్న ఇద్దరు..
తాంసి: అక్రమంగా మహారాష్ట్ర నుంచి దేశీదారు తీసుకువచ్చి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ రేండ్ల విజేందర్ తెలిపారు. మండలంలోని లీంగూడ గ్రామానికి చెందిన ఆత్రం దేవ్‌రావు, టేకం బర్కత్‌రావులు మహా రాష్ట్ర నుంచి దేశీదారు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. పక్కాసమాచారం మేరకు సిబ్బందితో కలిసి బుధవారం రాత్రి దాడి చేశారు. మద్యం విక్రయిస్తుండగా ఇద్దరిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10వేల విలువ గల 90 ఎమ్‌ఎల్ కలిగిన 280 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా దేశీదారు, నాటుసారా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ సిబ్బంది శ్రీధర్, హనుమంత్ పాల్గొన్నారు.