
‘మావోయిస్టుల సిద్ధాంతాలకు కాలం చెల్లింది’
చెన్నూర్: మావోయిస్టుల సిద్ధాంతాలకు కాలం చెల్లిందని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి, భీమా రం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు, పోస్టర్లు వెలిశాయని, దీనిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. మావోయిస్టుల సంచారం ఉన్న సమయంలో మారుమూల గ్రామాలు వెనుకబాటుకు గురయ్యాయని తెలిపారు. గత పదేళ్లుగా జిల్లాలో మావోయిస్టులు ఉనికి లేకపోవడంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మావోయిస్టుల దుశ్చర్యలను గమనించిన కొందరు చైతన్యవంతులైన ఆదివాసీ యువకులు మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు, కరపత్రాలు వేశారని తెలుస్తోందని అన్నారు. సమావేశంలో చెన్నూర్, చెన్నూర్ రూరల్ సీఐలు దేవేందర్‌రావు, సుధాకర్ పాల్గొన్నారు.