
కాంట్రాక్ట్ లెక్చరర్ల నిరవధిక సమ్మె
బాసర: యుటాక్ స్టేట్ అసోసియేషన్ పిలుపుమేరకు నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు సోమవారం నిరవధిక సమ్మె ప్రారంభించారు. 17 ఏళ్లుగా పని చేస్తున్న తమ ను రెగ్యులరైజ్ చేయాలని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీశైలం మా ట్లాడారు. బాసర ఆర్జీయూకేటీ కాంట్రాక్ట్ అధ్యాపకులతో ప్రారంభమైందని, విశ్వవిద్యాలయ పు రోగతికి తమవంతు కృషి చేస్తున్నామని తెలిపా రు. కాంట్రాక్ట్ వ్యవస్థకు ముగింపు పలికి విశ్వవి ద్యాలయాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్, డాక్టర్ విజ య్‌కుమార్, మందా సతీశ్‌కుమార్, డాక్టర్ రాములు, శ్రీధర్, తిలక్‌రెడ్డి, భానుప్రియ, రమాదేవి, ప్రశాంతి, రజితారెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
13వ రోజుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ల దీక్ష
ఆర్జీయూకేటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చే పట్టిన నిరవధిక నిరసన దీక్ష సోమవారం 13వ రోజుకు చేరింది. తమకు అదనపు బాధ్యతలు వ ద్దని, రెగ్యులర్ చేయాలని, తమ సేవలు గుర్తించాలని ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎర్రటి ఎండలో గొడుగులు పట్టుకుని విశ్వవిద్యాలయం ఆ వరణలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఉ పేంద్ర, కృష్ణప్రసాద్, ఖలీల్, డాక్టర్ కుమార్ రా గుల, డాక్టర్ విఠల్, ప్రకాశ్, డాక్టర్ రోషన్, డాక్టర్ సాయికృష్ణ, డాక్టర్ పావని, డాక్టర్ శ్వేత, డాక్టర్ స్వాతి తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్ట్ లెక్చరర్ల నిరవధిక సమ్మె