
బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో 2024–25 యాసంగి వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించామని, రైస్‌మిల్లర్లు పాత బకాయిలు పూర్తి చేసి బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ అన్నారు. గురువారం జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్‌లో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి బాయిల్డ్ రైస్‌మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కనీస మద్దతు ధరతో వరిధాన్యం కొనుగోలు చేస్తామని, సన్న రకం ధాన్యానికి మద్దతు ధరతోపాటు బోనస్ అందిస్తామని తెలిపారు. ధాన్యం దిగుమతి ఎలాంటి కోతలు లేకుండా చేయాలన్నారు. అ ధికారులు, బాయిల్డ్ రైస్‌మిల్లర్లు పాల్గొన్నారు.