28 నుంచి రాష్ట్రస్థాయి మహిళల హ్యాండ్‌బాల్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

28 నుంచి రాష్ట్రస్థాయి మహిళల హ్యాండ్‌బాల్‌ పోటీలు

Published Sat, Apr 26 2025 12:06 AM | Last Updated on Sat, Apr 26 2025 12:06 AM

28 నుంచి రాష్ట్రస్థాయి  మహిళల హ్యాండ్‌బాల్‌ పోటీలు

28 నుంచి రాష్ట్రస్థాయి మహిళల హ్యాండ్‌బాల్‌ పోటీలు

మందమర్రిరూరల్‌: ఈ నెల 28, 29, 30వ తేదీల్లో మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూల్‌ మైదానంలో రాష్ట్రస్థాయి మహిళల హ్యాండ్‌బాల్‌ పోటీలు నిర్వహించనున్నట్లు హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పోటీల్లో సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొంటారని, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా తరఫున 20 మంది ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో ఎంపికై న జట్టు గుజరాత్‌లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్‌ కోశాధికారి రమేష్‌రెడ్డి, కోచ్‌ అరవింద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement