
అధికారికంగా అమరుల సంస్మరణ దినోత్సవం
ఇంద్రవెల్లి: అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మొదటిసారిగా అధికారికంగా నిర్వహిస్తున్నామని, ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని ఆదిలా బాద్ కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. బుధవారం ఉట్నూర్ సబ్‌కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఏఎస్పీ కాజల్‌సింగ్‌లతో కలిసి మండలంలోని అమరవీరుల స్తూపాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సంస్మరణ దినోత్సవం నిర్వహణపై రాయిసెంటర్ సార్‌మెడీలు, అమరుల ఆశయ సాధన కమిటీ, ఆది వాసీ పెద్దలతో సమావేశమయ్యారు. వారు మా ట్లాడుతూ అమరవీరుల స్తూపాన్ని వివిధ రకాల పూలతో అలంకరించాలని తెలిపారు. 1981లో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన ఫొటోలతో పాటు ఆదివాసీ సంస్కృతికి చెందిన ఫొటోలను సేకరించి మ్యూజియం ఏర్పాటు చేయాలన్నారు. ఏప్రిల్ 20 సంస్మరణ దినోత్సవం రోజు రాష్ట్ర మంత్రి సీతక్క అమరుల కుటుంబాలకు ట్రైకర్ ద్వారా మంజూరైన వాహనాలు, యూనిట్‌లను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. వానాకా లంలో స్మృతివనంలో మొక్కలు నాటి వందశాతం పనులు పూర్తయిన తరువాత స్మృతివనా న్ని ప్రారంభిస్తామని తెలిపారు. అమరవీరుల ఆశయ సాధన కమిటీ చైర్మన్ తోడసం నాగో బారావ్ అమరవీరుల స్తూపం ప్రాంగణంలో వీధిదీపాలు ఏర్పాటు చేయాలని, తాగునీటి కోసం బోరు మంజూరు చేయాలని, ప్లాస్టిక్ కుర్చీ లు, గ్రీన్‌మ్యాట్ మంజూరు చేయడంతో పాటు వాచ్‌మెన్‌ను నియమించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఐటీడీఏ ఏపీవో జనరల్ వ సంత్‌రావ్, డీడీ అంబాజీ, ఈఈ తానాజీ, సార్‌మెడిలు మెస్రం దుర్గు, మెస్రం చిన్ను, ఏఎంసీ చై ర్మన్ ముఖడే ఉత్తం, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో జీవన్‌రెడ్డి, ఆదివాసీ సంఘాల నాయకులు గోడం గణేశ్, మెస్రం నాగ్‌నాథ్, పుర్క చిత్రు, ఆనంద్‌రావ్, నాగోరావ్ ఉన్నారు.
● ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా