
సాగునీటికి ప్రభుత్వం ప్రాధాన్యం
● చెన్నూరు ఎమ్మెల్యే వివేక్
భీమారం: రైతులకు సాగునీటిని అందించేందు కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామంలో పాత చెరువుకు రూ.33 లక్షలతో చేపట్టనున్న మరమ్మతు పనులను ఆదివారం ప్రారంభించా రు. చెరువుల కింద పెద్ద ఎత్తున పంటలు సాగవుతాయని, అందుకే చెరువుల అభివృద్ధికి కూ డా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు. తర్వాత పోలంపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రేషన్ కార్డుపై సన్న బియ్యం ఇస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు.
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే
పార్టీ కార్యాలయం..
రామకృష్ణాపూర్: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే మందమర్రిలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుచేసినట్లు చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. సింగరేణి బీ–1 క్వార్టర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. సింగరేణి కార్మికుల పెన్షన్ రూ.10 వేలకు పెంచేలా కేంద్రంపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. నాయకులు నోముల ఉపేందర్, సొత్కు సుదర్శన్, తిరుమల్ పాల్గొన్నారు.