
ఎస్‌ఆర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
ఆదిలాబాద్‌రూరల్: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్‌లో మావల మండలంలోని ఎస్‌ఆర్ ప్రైమ్ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. రాథోడ్ సచిన్ 3,333 ర్యాంకు, బి.శివసాయి 4,721, వాసు 6,876, ఎల్.శ్రీలేఖ 7,505, ఆక్షాద్ 8,071, జాదవ్ సాయిరామ్ 9,067, రాథోడ్ సంధ్య 9,156, రాథోడ్ పావని 11,113, రాథోడ్ హరీష్ 13,731 ర్యాంకుతో పాటు మరో 32 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు కళాశాల జోనల్ ఇన్‌చార్జి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం కళాశాల చైర్మన్‌తో పాటు డైరెక్టర్లు సదరు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాళ్లు జయపాల్‌రెడ్డి, అరవింద్, లలిత పాల్గొన్నారు.