
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
దండేపల్లి/మంచిర్యాలరూరల్(హాజీపూర్): రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. దండేపల్లి, హాజీపూర్‌లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొ క్కజొన్నల కొనుగోలు కేంద్రాలను ఆదివారం ప్రాంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు సాగునీటి నుంచి మొదలు, పండించిన పంటను కొనుగోలు చేసే వరకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. యాసంగిలో రైతులు వరితోపాటు, చాలాచోట్ల మొక్కజొన్న పంట సాగుచేశారన్నారు. దీంతో వరి కొ నుగోలు కేంద్రాలతోపాటు, మొక్క జొన్న కొ నుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలి పారు. హాజీపూర్ మండలంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 18 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వివి ధ పథకాలను మహిళల అభ్యున్నతికి తీసుకు వస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సహకార చైర్మన్ కోట్నాక తిరుపతి, ఆర్జీపీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, డీఆర్డీవో కిషన్, డీపీఎం వేణుగోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేంచంద్, ఏపీఎం బ్రహ్మయ్య, ఏవో అంజిత్, రైతులు పాల్గొన్నారు.