
పోలీస్ విధులకు ఆటంకం.. ముగ్గురు అరెస్ట్
మంచిర్యాలక్రైం: బ్లూకోట్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ఈనెల 13న రాత్రి 12.30 గంటలకు జిల్లాకేంద్రంలోని హరికృష్ణ లాడ్జి ఎదుట ముగ్గురు వ్యక్తులు ఇతరులకు ఇబ్బంది కలుగజేస్తున్నారని డయల్ 100కు కాల్ రాగా బ్లూకోట్ విధుల్లో ఉన్న హోంగార్డ్‌లు సత్యనారాయణ, రవిలు అక్కడికి వెళ్లారు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా అక్కడి నుంచి వెళ్లిపోవాలని సదరు వ్యక్తులకు సూచించారు. విధుల్లో ఉన్న పోలీసులను సైతం లెక్క చేయకుండా వారితో దురుసుగా ప్రవర్తించడంతో పాటు నానా దుర్భాషలాడుతూ విధులకు ఆటంకం కలిగించారు. దీంతో శ్రీరాంపూర్ ఆరునక్కనగర్‌కు చెందిన ఓ మైనర్ బాలుడితో పాటు బానోత్ సాయివికాస్, సీలారపు వినయ్‌లపై సత్యానారాయణ ఫిర్యాదు చేశారు. దీంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
చరిత్ర ఆనవాళ్లు లభ్యం
బోథ్: మండలంలోని దన్నూరు(బి) గ్రామ స మీపంలోని తూర్పు దిక్కున గల కొంకన్న గుట్ట ప్రాంతంలో లక్షల సంవత్సరాలు క్రితం ఆది మానవులు ఉపయోగించిన రాళ్లు లభ్యమైనట్లు బోథ్ ఎఫ్‌ఆర్‌వో ప్రణయ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ తన బృందంతో కలిసి అడవిని పరిశీలించే క్రమంలో చరిత్రకు సంబంధించిన పలు ఆనవాళ్లు ల భ్యమైనట్లుగా పేర్కొన్నారు. కొంకన్నగుట్ట మ ధ్యలో సూక్ష్మరాతి మొనదేలిన అత్యంత చురుకై న చాకు లాంటి రాళ్లు అనేకం ఉన్నాయన్నారు. పొచ్చర జలపాతం చుట్టుపక్కల సైతం లక్షల ఏళ్ల నాటి ఆదిమ సమాజం ఆనవాళ్లు నేటికీ భద్రంగా కనిపిస్తున్నాయని తెలిపారు.
‘కన్నయ్య కుటుంబానికి న్యాయం చేస్తాం’
వేమనపల్లి: మంగెనపల్లిలో ఆత్మహత్యకు పాల్పడిన నాయిని కన్నయ్య కుటుంబానికి చెందిన భూ సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. నీల్వాయి పోలీస్‌స్టేషన్‌లో కన్నయ్య కుటుంబ సభ్యులు, తెలంగాణ ఆదివాసీ గిరి జన సంఘం, సీపీఎం నాయకులతో శుక్రవా రం సమావేశమయ్యారు. వేమనపల్లి శివారు 464 సర్వే నంబర్‌లో కన్నయ్య తల్లి ఎల్లక్క పేరు మీద ఉన్న భూమి ఎనగంటి చిన్నన్న కొడుకు హరీశ్ పేరు మీదకు ఎలా పట్టా మార్చారన్న విషయమై విచారణ జరిపారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి రికార్డు పరంగా వివరాలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఏసీపీ వెంట చెన్నూర్ రూరల్‌సీఐ సుధాకర్, ఎస్సై శ్యాంపటేల్, సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు రాజన్న, మల్లేశ్వరి ఉన్నారు.

పోలీస్ విధులకు ఆటంకం.. ముగ్గురు అరెస్ట్