
గుండెపోటుతో పూజారి మృతి
లక్ష్మణచాంద: గుండెపోటుతో పూజారి ప్రాణాలు కోల్పోయిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన పూజారి పెరుమాండ్ల రమేశ్(75) గత 30 సంవత్సరాలుగా శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో పురోహితుడిగా సేవలు అందిస్తున్నారు. గత ఏ డాది నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం తన వద్దకు వచ్చిన ఒకరికి పంచాంగం చూశారు. ఆయన వెళ్లిపోయిన కొద్దిసేపటికే గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతిచెందారు. పూజారి మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.
ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంతాపం..
పూజారి పెరుమాండ్ల రమేశ్ అకాల మృతి విషయం తెలుసుకున్న నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.