
500 దేశీదారు సీసాలు స్వాధీనం
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని భీంసరిలో 90 ఎంఎల్ పరిమాణంలో ఉన్న 500 దేశీదారు సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ రేండ్ల విజేందర్ తెలిపా రు. మంగళవారం ఎకై ్సజ్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భీంసరి గ్రామానికి చెందిన అలిశెట్టి అభిలాష్ మహారాష్ట్రలోని చనాక నుంచి ద్విచక్ర వాహనంపై దేశీదారు తీసుకువస్తుండగా పట్టుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. మద్యం విలువ రూ.18వేలు ఉంటుందన్నారు. ఎవరైనా దేశీదారు, నాటుసారా విక్రయిస్తే రూ.లక్ష జరిమానాతో పాటు పీడీయాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని ఆదర్శ బాలికల క్రీడా పాఠశాలలో మంగళవారం నిర్వహించిన 54వ సీనియర్ మహిళా హ్యాండ్‌బాల్ పోటీల్లో 20 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమేశ్ తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం 80 మంది మహిళా క్రీడాకారులు పోటీల్లో పాల్గొనగా 20 మంది ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారన్నారు. ఈ నెల 18 నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 28 నుంచి 30 వరకు మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో డీఎస్‌వో మీనారెడ్డి, ఏసీఎంవో ఉద్దవ్, హ్యాండ్‌బాల్ కోచ్ అరవింద్, పీడీ, పీఈటీలు రవి, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు
మంచిర్యాలటౌన్: పట్టణంలోని హైటెక్ సిటీ కాలనీకి చెందిన నామని రమేశ్ కుమార్, మౌనిక దంపతుల కుమారుడు రామ్ అక్షరేష్ 8 నిమిషాల్లో 300ల పదాలను పఠించడం ద్వారా వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. ఎల్‌కేజీ చదువుతున్న రామ్ అక్షరేష్ తెలుగు సంవత్సరాలు, నెలలు, తిథులు, రాష్ట్ర రాజధానులు, జాతీయ చిహ్నాలు, గ్రహాలు, ఆవిష్కరణలు, చారిత్రాత్మక కట్టడాలతో సహా 300ల వరకు 8 నిమిషాల్లోనే పఠించడం ద్వారా రికార్డు సృష్టించారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డు భారత దేశ ప్రతినిధి బింగి నరేంద్ర గౌడ్, తెలంగాణ కోఆర్డినేటర్లు డాక్టర్ వేణుకుమార్, కే.రవికుమార్ చిన్నారికి మెమొంటో అందజేశారు.

500 దేశీదారు సీసాలు స్వాధీనం

500 దేశీదారు సీసాలు స్వాధీనం