'డ్రాగన్‌' నా లైఫ్‌లో జరిగిందే.. మనీ అడగాలంటే సిగ్గనిపించింది: డైరెక్టర్‌ | Return Of The Dragon Release in Hindi, Ashwath Marimuthu Special Post | Sakshi
Sakshi News home page

నేనొస్తున్నా.. చూసుకోండి మరి! స్టార్స్‌కు కుర్ర హీరో వార్నింగ్‌.. డైరెక్టర్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Published Sun, Mar 9 2025 3:23 PM | Last Updated on Sun, Mar 9 2025 3:40 PM

Return Of The Dragon Release in Hindi, Ashwath Marimuthu Special Post

కంటెంట్‌ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా సినిమాలు సక్సెస్‌ బాట పడతాయి. ఇటీవల వచ్చిన రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ మూవీ (Return Of The Dragon) కూడా అదే కోవలోకి వస్తుంది. లవ్‌ టుడే ఫేమ్‌ ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan) హీరోగా నటించిన ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 21న విడుదలైంది. అనుపమ పరమేశ్వరన్‌, కయాడు లోహర్‌ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ రూ.120 కోట్లపైనే వసూళ్లు రాబట్టింది. తాజాగా హిందీలోనూ విడుదలకు సిద్ధమైంది. 

ముందడుగు
ఈ విషయాన్ని హీరో ప్రదీప్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. మార్చి 14న రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ హిందీలో రిలీజవుతోంది. నా సినిమాలు దేశమంతటా చూడాలని ఎప్పటినుంచో అనుకునేవాడిని. నా ఆలోచనలు ఆచరణలో అమలయ్యేందుకు తొలి అడుగు పడింది. షారూఖ్‌ ఖాన్‌ సర్‌, సల్మాన్‌ ఖాన్‌ సర్‌, ఆమిర్‌ ఖాన్‌ సర్‌.. మీరందరూ పక్కకు జరగండి.. నేను వస్తున్నా అని సరదాగా ట్వీట్‌ చేశాడు.

అంత పెద్దోడివైపోయావా?
ఇది చూసిన నెటిజన్లు.. ఏంటి, బాలీవుడ్‌ హీరోలకే ధమ్కీ ఇస్తున్నావా? అంత పెద్దవాడివైపోయావా?, ఏదేమైనా హిందీలో రీమేక్‌ చేయకుండా డబ్బింగ్‌ చేసి మంచి పని చేశారు అని కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందించాడు. డ్రాగన్‌ సినిమా తన నిజ జీవితానికి సంబంధించిందని చిత్రదర్శకుడు అశ్వత్‌ మారిముత్తు తెలిపాడు. 

సినిమాలోని ఆ బ్యాచిలర్‌ రూమ్‌ నేను నివసించిందే!
'కొన్నిసార్లు మన జీవితంలో అత్యంత ముఖ్యమైనవారికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోతుంటాం. వాళ్లెవరో కాదు మన స్నేహితులే! డ్రాగన్‌ సినిమాలో చూపించే బ్యాచిలర్‌ రూమ్‌ లైఫ్‌ నా నిజజీవితంలోనిదే! కేవలం పాత్రలు మాత్రమే కాదు ఆ ప్లేస్‌ కూడా నేను నివసించిందే.. ఇగీ, పంబు, అంబు, అజయ్‌, కరుప్స్‌, బాలాజీ, జై, మురళి, జాన్‌, గ్లెన్‌, హరి, విక్కీ.. మేమంతా కాలేజీ ఫ్రెండ్స్‌. అందరం రూమ్‌ తీసుకుని ఉండేవాళ్లం. 

కాలేజీ అయిపోయాక జీరో
ఇందులో కొందరు అప్పుడప్పుడు మా దగ్గరకు వచ్చేవారు. సినిమాలో చూపించినట్లే కాలేజ్‌ అయిపోయాక నేను జీరోనయ్యాను. కానీ నాలో టాలెంట్‌ ఉందని నమ్మి నా స్నేహితులు నాకు అండగా నిలబడ్డారు. వాళ్లు కష్టపడి సంపాదించిన జీతంలో నుంచి ఒక్కొక్కరూ రూ.2000 చొప్పున నాకు ఇచ్చేవారు. ఆ డబ్బుతో షార్ట్‌ ఫిలింస్‌ తీశాను. ఒకసారి ఏదో పోటీలో నేను రెండో రౌండ్‌కు సెలక్ట్‌ అయ్యాను. 

నా బెస్ట్‌ ఫ్రెండ్‌ ప్రోత్సాహంతో..
కానీ ఫ్రెండ్స్‌ను మళ్లీ డబ్బులడగాలంటే నాకు సిగ్గుగా అనిపించింది. ఆ సమయంలో నా బెస్ట్‌ ఫ్రెండ్‌ ఇగీ.. అతడి తల్లికి ఫోన్‌ చేసి అశ్వత్‌ పోటీలో ముందుకు వెళ్లడానికి రూ.2 వేలిస్తున్నాను. మీరు అడ్జస్ట్‌ చేసుకోండి అని చెప్పాడు. అది నేనెన్నటికీ మర్చిపోలేను. 8 షార్ట్‌ ఫిలింస్‌ తీశా.. నా ప్రతి అడుగులో వారు తోడున్నారు. నా ఫోన్‌ పగిలిపోయినప్పుడు బాలాజీ ఫోన్‌ కొనిచ్చాడు. ఇంత మంచి మిత్రులు నా జీవితంలో ఉన్నారు. 

మా గ్యాంగ్‌లో నేనే మిగిలా..
నేను అందుకున్న విజయం వారి సొంతం. థాంక్యూ బాయ్స్‌.. ఈ రోజు మా గ్యాంగ్‌లో పంబు పెళ్లి జరిగింది. అంటే ఈ గ్యాంగ్‌లో సింగిల్‌గా మిగిలింది నేనొక్కడినే' అని రాసుకొచ్చాడు. ఇందుకు తన ఫ్రెండ్స్‌తో దిగిన పాత ఫోటోలను జత చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. ఇంత మంచి స్నేహితులు దొరకడం నీ అదృష్టం.. నువ్వు జీవితంలో ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలి అని కామెంట్లు చేస్తున్నారు.

 

చదవండి: కన్నడ స్టార్‌ యశ్‌తో విభేదాలు.. స్పందించిన సోదరి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement