కొన్నిసార్లు ఊహించని విధంగా కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. అలాంటి ఓ మూవీనే 'మహారాజ'. తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం.. థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చూసిన ప్రతిఒక్కరూ అద్భతహా అనే రేంజులో మెచ్చుకున్నారు. ఇంతలా పేరు తెచ్చుకున్న 'మహారాజ'లో నటించినందుకు గానూ సేతుపతి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. దీనికి ఓ కారణముందట!
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)
వైవిధ్యమైన పాత్రలు చేసే విజయ్ సేతుపతి.. 'మహారాజ'లో సెలూన్ షాపులో పనిచేసే బార్బర్‌గా నటించాడు. మేకప్ లేకుండా డీ గ్లామర్‌గా కనిపించాడు. సమాజంలో ప్రస్తుతం చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ పాయింట్‌కి చిన్నపాటి ట్విస్ట్ లింక్ చేసి తీసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే నిర్మాతలు ఈ మూవీ కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో మాత్రమే తీయాలని ఫిక్స్ అయ్యారట. ఇదే విషయాన్ని సేతుపతిగా చెప్పగా ఓకే అన్నాడు.
పైన చెప్పిన దానిబట్టి చూస్తే విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ తీసుకోకూడదు. 'మహారాజ' కోసం అదే చేశాడు. సినిమా హిట్ అయితే లాభాల్లో ఇస్తామని నిర్మాతలు చెప్పారట. ఈ లెక్కన చూసుకుంటే సినిమాకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. సాధారణంగా సేతుపతి.. ఒక్కో మూవీ రూ.10-12 కోట్లు తీసుకుంటాడు. కానీ లాభాల్లో షేర్ అంటున్నారు కాబట్టి పారితోషికం కంటే రెట్టింపు మొత్తం అందుకుంటాడేమో అనిపిస్తోంది. అంటే సక్సెస్‌తో పాటు జాక్ పాట్ కొట్టేసినట్లే!
(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?)
Comments
Please login to add a commentAdd a comment