ఓటీటీలో 'మహారాజ' రికార్డ్.. నం.1 ప్లేస్ | Vijay Sethupathi's Maharaja Movie Creates New Record In OTT | Sakshi

Maharaja OTT: హిందీ సినిమాల్ని వెనక్కి నెట్టి 'మహారాజ' రికార్డ్

Aug 21 2024 12:43 PM | Updated on Aug 21 2024 12:47 PM

Vijay Sethupathi's Maharaja Movie Creates New Record In OTT

విభిన్న సినిమాలతో అలరించే విజయ్ సేతుపతి.. రీసెంట్‌గా 'మహారాజ' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. అంచనాల్లేకుండా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. తెలుగు, తమిళంలో అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. కొన్నిరోజులకు ఓటీటీలోకి రాగా, అక్కడ కూడా మైండ్ బ్లోయింగ్ వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది.

(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలు)

'మహారాజ'లో విజయ్ సేతుపతి తప్పితే మరో పేరున్న యాక్టర్ ఎవరూ లేరు. సీరియస్ రివేంజ్ డ్రామా కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమాలో కథ ఓ మాదిరిగా ఉన్నప్పటికీ.. స్క్రీన్ ప్లేతో దర్శకుడు మేజిక్ చేశాడు. దీంతో తెలుగు, తమిళంలో హిట్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన తర్వాత దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది.

అలా దాదాపు ఆరు వారాల నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అయిన 'మహారాజ'.. ఈ ఏడాది సదరు ఓటీటీలో ఎక్కువమంది చూసిన సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు 18.6 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. దీని తర్వాతి స్థానాల్లో క్రూ (17.9 మిలియన్లు), లాపతా లేడీస్ (17.1 మిలియన్లు), సైతాన్ (14.8 మిలియన్లు), ఫైటర్ (14 మిలియన్లు), యానిమల్ (13.6 మిలియన్లు), డుంకీ (10.8 మిలియన్లు) ఉన్నాయి.

(ఇదీ చదవండి: ప్రధాని మోదీనే మించిపోయిన ప్రభాస్ హీరోయిన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement