రూ. 100 కోట్లతో మహారాజా.. ఓటీటీ ఎంట్రీ ఎప్పుడంటే..? | Vijay Sethupathi Movie Maharaja OTT Streaming Date | Sakshi
Sakshi News home page

రూ. 100 కోట్లతో మహారాజా.. ఓటీటీ ఎంట్రీ ఎప్పుడంటే..?

Jun 29 2024 3:08 PM | Updated on Jun 29 2024 4:23 PM

Vijay Sethupathi Movie Maharaja OTT Streaming Date

 విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా  జూన్ 14న విడుదలైంది. నితిల‌న్ సామినాథ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌న కూతురికి జరిగిన అన్యాయాన్ని ఒక సామాన్యుడు ఎలా ఎదుర్కొన్నాడు అనే పాత్రలో విజయ్‌ సేతుపతి అద్భుతంగా నటించాడు. అనురాగ్ క‌శ్య‌ప్‌, మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌, అభిరామి వంటి వారు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

విజయ్ సేతుపతి కెరియర్‌లో మహారాజా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయిన ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. నివేదికల ప్రకారం మహారాజా చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 19న OTT విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కానీ, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, తమిళ్‌ వర్షన్స్‌ రెండూ ఒకేరోజు విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. 

తెలుగుతో పాటు త‌మిళంలో కూడా బయర్స్‌కు లాభాల పంట‌ను ప‌డించిన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్స్‌లలో సందడి చేస్తుంది.  టాలీవుడ్‌లో అయితే, ఏకంగా రూ. 20 కోట్ల కలెక్షన్స్‌ దాటినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ విషయంలో కూడా మహారాజా సినిమాను మంచి రేటుతోనే నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement