విడుదలకు ముందే ఓటీటీ ఫిక్స్‌ చేసుకున్న స్టార్‌ హీరో! | Tamil star Hero Vijay Sethupathi latest Movie maharaja OTT Fix | Sakshi
Sakshi News home page

Vijay Sethupathi: విడుదలకు ముందే ఓటీటీ ఫిక్స్‌ చేసుకున్న 'మహారాజా'!

Published Wed, Jun 5 2024 9:06 PM | Last Updated on Wed, Jun 5 2024 9:15 PM

Tamil star Hero Vijay Sethupathi latest Movie maharaja OTT Fix

తమిళ స్టార్ హీరో  విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం మహారాజా. ఫుల్‌ యాక్షన్ ఓరియంటెడ్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే  ట్రైలర్ రిలీజ్‌ కాగా..ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. విజయ్ సేతుపతి కెరీర్‌లో ఇది 50వ చిత్రంగా నిలవనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ టాక్‌ వినిపిస్తోంది. విడుదలకు ముందే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఫిక్స్‌ చేసుకుంది.

ఈ మూవీని ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన తెలుగు ట్రైలర్ మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అయితే తెలుగు వర్షన్ విడుదలపై మేకర్స్ ఇంకా స్పందించలేదు. కాగా.. ఈ సినిమా జూన్ 14న రిలీజ్‌ కానుంది.  తాజాగా ఈ సినిమా విడుదల తేదీని తెలియజేస్తూ చిత్ర బృందం పోస్టర్‌ విడుదల చేసింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement