మారి సీక్వెల్‌కు టీమ్ రెడీ | More news about Dhanush's 'Maari 2' | Sakshi
Sakshi News home page

మారి సీక్వెల్‌కు టీమ్ రెడీ

Published Sun, Nov 8 2015 3:38 AM | Last Updated on Wed, Apr 3 2019 9:01 PM

మారి సీక్వెల్‌కు టీమ్ రెడీ - Sakshi

మారి సీక్వెల్‌కు టీమ్ రెడీ

నటుడు ధనుష్‌ను పక్కా మాస్ పాత్రలో చూపించిన చిత్రం మారి. కాజల్ అగర్వాల్ నాయకిగా నటించిన ఈ చిత్రానికి బాలాజీమోహన్ దర్శకుడు. అయితే ఆయన ఇంతకుముందు చిత్రాలు కాదలిల్ సొదప్పవదు ఎప్పడీ, వాయై మూడి పేసవుం చిత్రాలకు పూర్తి భిన్నమైన చిత్రం మారి. ఆ చిత్రం కమర్శియల్‌గా మంచి విజయాన్నే సాధించింది. కాగా చిత్రం విడుదల సమయంలోనే దానికి సీక్వెల్ చేసే ఆలోచన ఉందని దర్శకుడు వెల్లడించారు. అది ఇప్పుడు తెర రూపం దాల్చనుంది.

అయితే యూనిట్‌లో కొన్ని మార్పులతో మారి-2 ను తెరకెక్కించడానికి దర్శకుడు రెడీ అవుతున్నారు. ధనుష్ హీరోగా నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సంగీత దర్శకుడు అనిరుద్ యూనిట్‌లో కొనసాగనున్నారు. ఇక కాజల్ అగర్వాల్ కూడా రెండోసారి ధనుష్‌తో రొమాన్స్‌కు ఓకే అన్నట్లు సమాచారం. దర్శకుడు బాలాజీ మోహన్ కథను వండే పనిలో లీన మయ్యారట. అయితే ఆ చిత్రం వచ్చే ఏడాదిలోనే తెరకెక్కనుంది.

తంగమగన్ చిత్రాన్ని పూర్తి చేసిన ధనుష్ త్వరలో దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఆ తరువాత వెట్ట్రిమారన్ దర్శకత్వంలో వడచెన్నై చిత్రం చేయనున్నారు. తర్వాత మారి సీక్వెల్ సెట్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement