Maari Movie
-
ఆటోడ్రైవర్
సాయి పల్లవికి కారు నడపడం బాగా వచ్చు. ‘ఫిదా’ సినిమాలో వరుణ్ తేజ్‌ని రైల్వే స్టేషన్ నుంచి పికప్ చేసుకుని, రయ్‌మని కారులో తీసుకెళ్లే సీన్ గుర్తు చేసుకోండి. అదే సినిమాలో ఈ బ్యూటీ ధైర్యంగా ట్రాక్టర్ నడిపారు. అదే సినిమాలో స్కూటీని కూడా సునాయాసంగా నడిపారు. ఇప్పుడు తమిళ చిత్రం ‘మారీ 2’ కోసం ఆటో నడుపుతున్నారు. ఈ సినిమాలో ఆమె ఆటో డ్రైవర్‌గా కనిపించనున్నారు. ఆల్రెడీ ఆటో ఎలా నడపాలో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ధనుష్ హీరోగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో రూపొందిన ‘మారీ’కి సీక్వెల్ ఇది. ఫస్ట్ పార్ట్‌లో కాజల్ కథానాయికగా నటించగా, రెండో పార్ట్‌లో సాయి పల్లవిని తీసుకున్నారు. ఏ పాత్ర అయినా ఈజీగా చేసేసే సాయి పల్లవి ఆటో డ్రైవర్‌గా మెప్పిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా కాకుండా æశర్వానంద్ హీరోగా రూపొందుతున్న ‘పడి పడి లేచె మనసు’ చిత్రంలోనూ, సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న ‘ఎన్జీకె’ చిత్రంలోనూ సాయి పల్లవి నటిస్తున్నారు. -
రెండో సారి
హీరోగా చేయబోతున్న 37వ సినిమాతో రెండోసారి మెగా ఫోన్ పట్టనున్నారు దర్శక–నటుడు–నిర్మాత ధనుష్. రాజ్ కిరణ్ లీడ్ రోల్ చేసిన ‘పవర్ పాండి’ చిత్రం దర్శకుడిగా ధనుష్‌కి మొదటి సినిమా. బాక్సాఫీసు వద్ద డీసెంట్ హిట్ తెచ్చుకున్న ఈ సినిమా సీక్వెలే దర్శకుడిగా ధనుష్‌కి రెండో సినిమా అవుతుందన్న ఊహాగానాలు కోలీవుడ్‌లో వినిపించాయి. అయితే.. ఆ ఊహాగానాలు తప్పని తేల్చేశారాయన. ‘‘నా దర్శకత్వంలో రూపొందబోయే సినిమా గురించి వస్తున్న రూమర్స్‌కు ఫుల్స్టాప్ పెడుతున్నాను. తేనాండాళ్ ఫిల్మ్ పతాకంపై నేను హీరోగా చేయబోతున్న సినిమానే నా రెండో డైరెక్షన్ ప్రాజెక్ట్’’ అని పేర్కొన్నారు ధనుష్. మరోవైపు రెండేళ్ల క్రితం వచ్చిన ‘మారి’ సినిమాకు సీక్వెల్ చేయనున్నారు ధనుష్. బాలాజీ మోహన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. సాయి పల్లవిని హీరోయిన్గా తీసుకున్న ఈ సినిమా యూనిట్ లేటెస్ట్గా ఓ కీలక పాత్రకు వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను ఎంపిక చేసినట్లు ఎనౌన్స్ చేసింది. అంతేకాదు.. పదేళ్ల తర్వాత ధనుష్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. -
మారి సీక్వెల్‌కు టీమ్ రెడీ
నటుడు ధనుష్‌ను పక్కా మాస్ పాత్రలో చూపించిన చిత్రం మారి. కాజల్ అగర్వాల్ నాయకిగా నటించిన ఈ చిత్రానికి బాలాజీమోహన్ దర్శకుడు. అయితే ఆయన ఇంతకుముందు చిత్రాలు కాదలిల్ సొదప్పవదు ఎప్పడీ, వాయై మూడి పేసవుం చిత్రాలకు పూర్తి భిన్నమైన చిత్రం మారి. ఆ చిత్రం కమర్శియల్‌గా మంచి విజయాన్నే సాధించింది. కాగా చిత్రం విడుదల సమయంలోనే దానికి సీక్వెల్ చేసే ఆలోచన ఉందని దర్శకుడు వెల్లడించారు. అది ఇప్పుడు తెర రూపం దాల్చనుంది. అయితే యూనిట్లో కొన్ని మార్పులతో మారి-2 ను తెరకెక్కించడానికి దర్శకుడు రెడీ అవుతున్నారు. ధనుష్ హీరోగా నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సంగీత దర్శకుడు అనిరుద్ యూనిట్లో కొనసాగనున్నారు. ఇక కాజల్ అగర్వాల్ కూడా రెండోసారి ధనుష్‌తో రొమాన్స్‌కు ఓకే అన్నట్లు సమాచారం. దర్శకుడు బాలాజీ మోహన్ కథను వండే పనిలో లీన మయ్యారట. అయితే ఆ చిత్రం వచ్చే ఏడాదిలోనే తెరకెక్కనుంది. తంగమగన్ చిత్రాన్ని పూర్తి చేసిన ధనుష్ త్వరలో దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఆ తరువాత వెట్ట్రిమారన్ దర్శకత్వంలో వడచెన్నై చిత్రం చేయనున్నారు. తర్వాత మారి సీక్వెల్ సెట్ పైకి వెళ్లే అవకాశం ఉంది. -
నన్ను అర్థం చేసుకునేవాడైతే ఓకే
నేను మనువాడే వాడు మంచి మనసున్నవాడై ఉండాలి,నన్ను అర్థం చేసుకునేవాడై ఉండాలి అంటున్నారు నటి కాజల్‌అగర్వాల్. ఇప్పటి వరకూ టాలీవుడ్లో వెలిగిన ఈ ఉత్తరాది బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్‌పై దృష్టి పెట్టారు.తొలుత బొమ్మలాటం చిత్రం ద్వారా దర్శకుడు భారతీరాజా పరిచయం చేసిన నటి కాజల్. ఆ తరువాత పళని,నాన్ మహాన్అల్ల,తుపాకీ, జిల్లా తదితర చిత్రాల్లో నటించారు. అయితే తొలి చిత్రం నిరాశ పరచడంతో మదనపడిన ఈ బ్యూటీకి టోలీవుడ్‌లో చందమామ లాంటి అవకాశం ఆదుకుంది. ఆపై మగధీర స్టార్‌డమ్‌ను అందించడంతో వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. అలాగే కోలీవుడ్‌లో మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న కాజల్‌కు తుపాకీ బాగా పేలింది. వెంటనే విజయ్‌తో జిల్లా చిత్రంలో లక్కీచాన్స్ రావడంతో హిట్ హీరోయిన్ అయ్యిపోయింది.ప్రస్తుతం కోలీవుడ్‌పైనే దృష్టి సారిస్తున్న ఈ సుందరి ధనుష్ సరసన మారీ విశాల్‌కు జంటగా పాయుంపులి చిత్రాల్లో నటిస్తున్నారు.త్వరలో విక్రమ్‌లో జోడీ కట్టడానికి సిద్ధం అవుతున్న కాజల్ మారీ చిత్ర ప్రచారంలో భాగంగా బుధవారం చెన్నైలో విలేకరులతో ముచ్చటించారు.ఈ సందర్భంగా ఈ బ్యూటీతో చిన్న భేటీ ప్రశ్న: మారీ చిత్రంలో నటించిన అనుభవం గురించి? జవాబు: ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను. దనుష్‌తో నటించడం మంచి అనుభం. అదేవిధంగా దర్శకుడు బాలాజీమోహన్ తో పని చేయడం చాలా సౌకర్యంగా ఉంది. మారీ జనరంజికమైన కమర్శియల్ చిత్రం. ప్రశ్న: చిత్రంలో మీ పాత్ర? జవాబు: ఫ్యాషన్ డిజైనర్‌గా నటిస్తున్నాను. ప్రశ్న: తమిళ చిత్రాలలో నటిస్తున్నా తమిళంలో మాట్లాడలేకపోతున్నారే? జవాబు: ఇప్పుడిప్పుడే తమిళ భాష నేర్చుకుంటున్నాను. ప్రశ్న: పారితోషికం రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నారట? జవాబు: అందంతా అవాస్తవం. నా అర్హతకు తగ్గ పారితోషికమే పొందుతున్నాను. ప్రశ్న: హీరోలకు విందు ఇచ్చి అవకాశాలు దక్కించుకుంటున్నారన్న ప్రచారానికి మీ బదులు? జవాబు: నేనేవరికీ విందులు ఇవ్వలేదు. అదంతా అసత్యప్రచారమే,అయినా అవకాశాల కోసం ఎవరైనా పార్టీలు ఇస్తారా? ప్రశ్న: మీకు నచ్చిన హీరో? జవాబు; రజనీకాంత్ ప్రశ్న: మీలాంటి యువ నటి ఐశ్వర్య కాక్కముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించి ప్రశంసలు అందుకుంటున్నారు. మీరు అలా ఇద్దరు పిల్లల తల్లిగా నటిస్తారా? జవాబు: అలాంటి పాత్ర లభిస్తే తప్పకుండా నటిస్తా. ప్రశ్న: ప్రేమ,పెళ్లి గురించి? జవాబు: ప్రస్తుతం ప్రేమించడానికి సమయం లేదు. ఇక పెళ్లి ఆలోచన ఏం ఉంటుంది? ప్రశ్న: ఎలాంటి భర్త కావాలని కోరుకుంటారు? జవాబు: నాకు తెలియదు. ఎందుకంటే అలాంటి వారెవర్నీ నేను కలుసుకోలేదు. అయినా చెప్పాలంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరుకు చెందిన వారైనా పర్వాలేదు. ఎలాంటి నిబంధనలు పెట్టను.అయితే తను నన్ను అర్థం చేసుకునేవాడై ఉండాలి. చాలా నిజాయితీగా ఉండాలి. -
ఆ భయాన్ని అధిగమించా: కాజల్
చెన్నె: 'మగధీర' మిత్రవింద కాజల్ అగర్వాల్ కు పక్షులంటే భయమటా. ముఖ్యంగా ప్రేమపక్షి పావురాన్ని చూస్తే ఇంకా బెదిరిపోతుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అయితే ఇప్పుడు ఆ భయం పోయిందని కూడా ఈ 'చందమామ' సెలవిచ్చింది. 'మారీ' తమిళ సినిమా చేసిన తర్వాత పక్షులంటే భయం పోయిందని కాజల్ వెల్లడించింది. ఈ సినిమాలో చాలా పక్షులున్నాయని తెలిపింది. సినిమా కోసం పక్షులను పట్టుకుని నటించాల్సి వచ్చిందని, మొదట్లో కాస్త భయం వేసినా తర్వాత అలవాటైందని వెల్లడించింది. ఇప్పుడు విహంగాలను చూస్తే అస్సలు భయం వేయడం లేదని అమ్మడు తెలిపింది. 'మారీ' సినిమాకు బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను శరత్ కుమార్, రాధిక నిర్మించారు.