Vijay Antony Bichagadu 2 Sneak Peek Trailer Out Today - Sakshi
Sakshi News home page

Bichagadu 2 Trailer: వినూత్నంగా బిచ్చగాడు 2 ప్రమోషన్స్‌, హీరో లేకుండా ట్రైలర్‌..!

Published Fri, Feb 10 2023 6:27 PM | Last Updated on Fri, Feb 10 2023 7:20 PM

Vijay Antony Bichagadu 2 Sneak Peek Trailer Launch - Sakshi

తమిళ హీరో విజయ్‌ ఆంటోని హీరో తెరకెక్కితోన్న లేటెస్ట్‌ చిత్రం ‘బిచ్చగాడు 2’. గతంలో సాధారణ సినిమాగా విడుదలై సెన్షేషన్ క్రియేట్ ‘బిచ్చగాడు’కు ఇది సీక్వెల్‌​. ప్రస్తుతం మూవీ షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇదిలా రీసెంట్‌గా మలేషియలో జరిగిన షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో విజయ్‌ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్‌ ఆంటోని 90 శాతం కోలుకున్నాడు. దీంతో అతడు షూటింగ్‌ను ప్రారంభించాడు. ఇక ఈ చిత్ర సమ్మర్‌ కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వినూత్నంగా ప్రారంభించింది.

చదవండి: ఆటో రామ్‌ ప్రసాద్‌కు క్యాన్సర్‌? స్పందించిన నటుడు

తాజాగా బిచ్చగాడు 2కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ వదిలారు మేకర్స్‌. టీజర్‌, ట్రైలర్‌లకు భిన్నంగా ‘స్నీక్‌ పీక్‌ ట్రైలర్‌’ అంటూ సినిమా ఓపెనింగ్‌ సన్నివేశాన్ని విడుదల చేసి, అంచనాలు పెంచుతోంది. నాలుగు నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్‌లో ఎక్కడ హీరో గనిపించకపోవడం విశేషం. డబ్బు ప్రపంచానికి హానికరం అనే క్యాప్షన్‌తో రిలీజ్‌ చేసిన ట్రైలర్‌ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. బ్రెయిన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అనే భిన్న కాన్సెప్ట్‌తో బిచ్చగాడు 2 రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఆధునాతనమైన టెక్నాలజీని డబ్బు కోసం ఎలా దుర్వినియోగం చేశాడు, దీని ఎదురయ్యే పరిణామాల చూట్టు బిచ్చగాడు 2 కథ ఉండోబోతుందని తెలుస్తోంది.

చదవండి: ప్రకాశ్‌ రాజ్‌ కామెంట్స్‌పై ఘాటుగా స్పందించిన కశ్మీర్‌ ఫైల్స్‌ డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement