సూపర్‌స్టార్ కబాలి-2 చేస్తారా? | Producer Thanu hints at 'Kabali 2' as the Rajinikanth-starrer breaks box-office record | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్ కబాలి-2 చేస్తారా?

Published Tue, Jul 26 2016 2:12 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

సూపర్‌స్టార్ కబాలి-2 చేస్తారా?

సూపర్‌స్టార్ కబాలి-2 చేస్తారా?

 తమిళసినిమా; కబాలి ఫీవర్ ఇంకా తగ్గలేదు. వసూళ్ల జోరు తగ్గలేదు. దటీజ్ సూపర్‌స్టార్ స్టామినా అనక తప్పదు. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కబాలి. ఈ చిత్రం విడుదలకు ముందు ఆ తరువాత కూడా ఒక సంచలనం. ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చిన కబాలి సూపర్‌స్టార్ గత చిత్రాలకు పూర్తిగా భిన్నం అని చెప్పక తప్పదు. ఎందుకం టే ఇందులో రజనీకాంత్ తరహా స్టైల్ కనిపిం చదు.
 
 పంచ్‌డైలాగ్స్ ఉండవు. ఇంకా చెప్పాలంటే రజనీ తరహా నటనను చూడలేం. ఆయన హావభావాల నుంచి అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ఆ క్రెడిట్ మాత్రం దర్శకు డు రంజిత్‌దే అని చెప్పక తప్పదు. అయితే కబాలి చిత్రం అందర్నీ అలరిస్తోందని చెప్పలేం. కొందరు ఆహా ఓహో అంటున్నారు. మరి కొందరు ఓకే అంటున్నారు. ఇంకొందరు పెదవి విరుస్తున్నారు. నటి లక్ష్మీరామకృష్ణన్ వంటి వారు రజనీకాంత్ చిత్రాన్ని ఇంకా ఎక్కువ ఊహించామని అంటున్నారు. ఇలా కబాలి చిత్రంపై ఎవరి అభిప్రాయాలు వారికున్నాయి.
 
 కబాలి-2లో రజనీ?
 కాగా కబాలి చిత్రం చూసిన వారు దీనికి పార్టు-2 వస్తుందా?అంటూ చర్చించుకుంటున్నా రు. క్లైమాక్స్‌ను దర్శకుడు ఆ విధంగా ముగింపు పలికారు. కబాలి తన పాఠశాల పిల్లల ప్రశ్నలకు సమాధానం ఇస్తుండగా ఆ పాఠశాలకు చెందిన ఇక విద్యార్థికి మలేషియా పోలీస్‌అధికారి ఒక తుపాకీ ఇచ్చి కబాలి వద్దకు పంపడం, అతను రాగానే స్క్రీన్ బ్లాక్ అవడం, ఈ తరువాత తుపాకీ పేలిన శబ్ధం రావడం చాలా సస్పెన్స్‌ను క్రియేట్ చేసింది. కాగా కబాలి చిత్రానికి సీక్వెల్ ఉంటుందా? అన్న ప్రశ్నకు ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.ధాను తాను రెడీ అన్నట్టు కోలీవుడ్ మీడియాలో జరుగుతున్న ప్రచారం.
 
 అయితే కబాలి-2లో నటించడానికి సూపర్‌స్టార్ అంగీకరిస్తారా?అసలు ఈ చిత్రంపై ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఏమిటి? అన్న విషయాలు రజనీకాంత్ నోరు విప్పితేనే తెలుస్తుంది. అమెరికా నుంచి ఆదివారమే చెన్నైకి తిరిగొచ్చిన ఆయన కబాలి చిత్రంపై స్పందన కోసం యావత్ సినీప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి మన సూపర్‌స్టార్ అసలు కబాలి గురించి స్పందిస్తారో?లేదో? వేచి చూడాల్సిందే. కాగా ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో రోబో-2 చిత్రాన్ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
 కలెక్షన్లు కొల్లగొడుతున్న కబాలి
 అయితే రజనీకాంత్ అభిమానుల్ని మాత్రం కబాలి విపరీతంగా అలరిస్తోంది. వారు చాలా ఖుషీ అవుతున్నారు. ఇలా మిశ్రమ స్పందన వస్తున్నా దానితో నిమిత్తం లేకుండా కబాలి కలెక్షన్లలో మాత్రం బాక్సాపీస్ బద్ధలైపోతోంది. ఈ విషయంలో మాత్రం మరో మాట లేదు. ఇప్పట వరకూ భారతీయ సినీ చరిత్రలో ఏ చిత్రం సాధించని కలెక్షన్లను కబాలి సొంతం చేసుకుంటోంది. తమిళం, తెలుగు, మలయా ళం, కన్నడం, హిందీ అంటూ తారతమ్యం లేకుండా వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
 
 బాలీవుడ్ బెంబేల్
 ముఖ్యంగా బాలీవుడ్ చిత్రపరిశ్రమను కబాలి బెంబేలెత్తిస్తోంది. కబాలి కలెక్షన్లు అక్కడి దర్శక నిర్మాతలను కలవరపెడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. 22,23,24 ఈ మూడు రోజు ల్లోనే ప్రీమియర్ షోలతో కలిపి కబాలి 300 కోట్లు కొల్లగొట్టిందని బాలీవుడ్ బాక్సాపీస్ వర్గాలు లెక్కలు కడుతున్నారు. కాగా ధూమ్-3 దే ఇప్పటి వరకూ బాలీవుడ్‌లో రికార్డట. ఆ చిత్రం తొలి వారంలో 70 కోట్లు వసూల్ చేసిందట. అయితే కబాలి ఇప్పటికే 87 కోట్లు వసూల్ చేసి ఆ రికార్డును బద్ధలు కొట్టడంతో పాటు ఆల్‌టైమ్ రికార్డుగా నిలిచిందనే టాక్ వి నిపిస్తోంది. ఈ రికార్డును భవిష్యత్‌లో మన చి త్రాలు బ్రేక్ చేస్తాయా అన్న కలత బాలీవుడ్ చిత్ర పరిశ్రమ వర్గాలకు పట్టుకుందట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement