
ఆల్మోస్ట్ తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి ‘త్రీ ఇడియట్స్’ సినిమా రిలీజై. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్, మాధవన్, శర్మాన్ జోషి ముఖ్య తారలుగా రూపొందిన ఈ సినిమా ఓన్లీ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు ఆడియన్స్‌లోనూ సూపర్‌హిట్ సాధించింది. ఈ సినిమా ఇతర భాషల్లో రీమేక్ అవ్వడమే కాదు, పరాయి దేశాల సినీ అభిమానులను మెప్పించింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని బాలీవుడ్ టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ ఇనిషియల్ స్టేజ్‌లో ఉందట.
‘త్రీ ఇడియట్స్’ సినిమాకు సీక్వెల్‌ను తీయాలన్న ఆలోచన ఉంది. కొన్ని రోజుల క్రితం ఈ వర్క్ మొదలైంది. ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది’’ అని తన సన్నిహితులతో అన్నారట హిరానీ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందిన సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’ ఈ నెల 29న విడుదల కానుంది. ఇందులో రణబీర్ కపూర్ లీడ్ రోల్ చేశారు. ఇదిలా ఉంటే ‘త్రీ ఇడియట్స్’ సీక్వెల్‌కి ముందు ‘లగే రహో మున్నా భాయ్’ సినిమా సీక్వెల్‌ను హిరానీ రూపొందిస్తారని టాక్. అంటే ‘త్రీ ఇడియట్స్’ రావడం కాస్త లేట్ అయినా రావడం పక్కా అన్నమాట.