
కన్నడనాట సంచలనం సృష్టించిన సూపర్ హిట్ సినిమా కేజీయఫ్. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడలోనే కాదు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ రిలీజ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది. కేజీయఫ్ ప్రారంభించినప్పుడే రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. తొలి భాగం ఘన విజయం సాధించటంతో ఇప్పుడు సెకండ్ పార్ట్‌పై దృష్టి పెట్టారు.
కేజీయఫ్ చాప్టర్ 1కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది. తొలి భాగంలో గరుడను అంతం చేసిన రాఖీ, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ను ఎలా సొంతం చేసుకున్నాడు.. తన నేర సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు. చివరకు ఏమయ్యాడు? అన్న విషయాలను రెండో భాగంలో చూపించనున్నారు. తొలి భాగం అన్ని భాషల్లో కలిపి 225 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అత్యధిక కలెక్షన్లు సాదించిన కన్నడ సినిమాగా ఆల్‌టైం రికార్డ్ సాధించటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment