Sonam Kapoor Post After Rana Daggubati Apologises For Recent Comments - Sakshi
Sakshi News home page

Sonam Kapoor: అలాంటి వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా.. రానాను ఉద్దేశించేనా?

Published Wed, Aug 16 2023 1:04 PM | Last Updated on Wed, Aug 16 2023 1:23 PM

Sonam Kapoor Post After Rana Daggubati Apologises For Recent Comments - Sakshi

సీతారామంతో టాలీవుడ్‌లోనూ క్రేజ్ దక్కించుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఆయన తాజాగా నటించిన చిత్రం 'కింగ్‌ ఆఫ్‌ కోత'. అభిలాష్‌ జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  జీ స్టూడియోస్‌, వెఫేరర్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవలే ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన రానా.. తన స్నేహితుడు దుల్కర్‌పై ప్రశంసలు కురిపించాడు. 

(ఇది చదవండి: ఆ హీరోయిన్‌కి క్షమాపణలు చెప్పిన రానా)

అయితే అదే సమయంలో ఓ స్టార్ హీరోయిన్‌ను ఉద్దేశించి రానా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే 2018లో దుల్కర్, సోనమ్ కపూర్ జంటగా  'ద జోయా ఫ్యాక్టర్‌' అనే చిత్రంలో నటించారు. ఆ సమయంలో షూటింగ్ స్పాట్‌కు వెళ్లిన రానాకు ఆమె వ్యవహరించిన తీరు కోపం తెప్పించిందట. దుల్కర్ సెట్‌లో వెయిట్ చేస్తుంటే.. తాను మాత్రం భర్తతో ఫోన్ మాట్లాడుతూ కాలక్షేపం చేసిందని అన్నారు.

అయితే ఈ విషయంపై ఇప్పటికే రానా వివరణ ఇచ్చారు. తన మాటలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు.  తన కామెంట్స్‌ వల్ల ఇబ్బంది పడుతున్న  సోనమ్‌, దుల్కర్‌లకు నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నానని రానా ట్వీట్‌  చేసిన సంగతి తెలిసిందే. కాగా.. సోనమ్‌.. రానా భార్య మిహికా బజాజ్‌కు మంచి స్నేహితురాలు కూడా అని తెలుస్తోంది. 

అయితే తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో మరోసారి చర్చకు దారితీసింది. రానా క్షమాపణల తర్వాత సోనమ్ తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో ఓ కొటేషన్ పోస్ట్ చేసింది. అది యూఎస్ ప్రథమ మహిళ ఎలియనోర్ రూజ్‌వెల్ట్ రాసిన కోటేషన్. మె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేస్తూ.. 'నేను కొంతమంది వ్యక్తుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ప్రత్యేకించి అలాంటి వ్యక్తుల గురించి. సంకుచితమైన మైండ్‌సెట్ గలవారే వ్యక్తుల గురించి చర్చిస్తారు. యావరేజ్ మైండ్ వాళ్లు సంఘటనలపై మాట్లాడతారు. అలాగే గొప్ప మేధావులు ఆలోచనల గురించి చర్చిస్తారు.' అంటూ ఆ కోటేషన్‌లో ఉంది. అయితే ఈ కోట్ టాలీవుడ్ హీరో రానాను ఉద్దేశించి చేసిందనే చర్చ మొదలైంది. రానా క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేసిన వెంటనే ఈ పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. 

(ఇది చదవండి: ఖుషి ఈవెంట్‌లో మీడియా, మహిళలపై దౌర్జన్యం.. లోనికి రాన్వివకుండా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement