Hero Rana Daggubati Say Sorry To Sonam Kapoor And Dulquer Salmaan - Sakshi
Sakshi News home page

Rana Daggubati: ఆ హీరోయిన్‌కి క్షమాపణలు చెప్పిన రానా

Published Tue, Aug 15 2023 2:24 PM | Last Updated on Tue, Aug 15 2023 3:20 PM

Hero Rana Daggubati Say Sorry To Sonam Kapoor And Dulquer Salmaan - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌, నటుడు దుల్కర్‌ సల్మాన్‌లకు హీరో రానా క్షమాపణలు చెప్పాడు. తన మాటలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని తప్పుదోవపట్టిస్తున్నందుకు చింతిస్తున్నానని, ఏది ఏమైనా తన కామెంట్స్‌ కారణంగా ఇబ్బందిపడుతున్న సోనమ్‌, దుల్కర్‌లకు నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నానని రానా ట్వీట్‌ చేశాడు.

(చదవండి: 'వ్యూహం'టీజర్‌: కల్యాణ్‌కు బాబు వెన్నుపోటు.. వాడికంత సీన్‌లేదు!)

వివరాల్లోకి వెళి​తే.. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం‘కింగ్‌ ఆఫ్‌ కోత’.  రితికా సింగ్, ఐశ్వర్య లక్ష్మి, అనిఖా సురేంద్రన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ మూవీకి అభిలాష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్ట్‌ 24న ఈ  చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ప్రిరీలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించింది చిత్ర యూనిట్‌. ఈ కార్యక్రమానికి హీరో రానా ముఖ్య అతిథిగా వెళ్లారు.

ఈ సందర్భంగా రానా.. దుల్కర్‌ మంచితనం గురించి మాట్లాడుతూ...‘ఓ రోజు దుల్కర్‌ నటిస్తున్న సినిమా షూటింగ్‌కి వెళ్లాను. ఆ సినిమాలో బాలీవుడ్‌కి చెందిన పెద్ద నటి హీరోయిన్‌. షూటింగ్‌ సమయంలో ఆమె నటనపై ఫోకస్‌ చేయకుండా.. లండన్‌లో ఉన్న భర్తతో ఫోన్‌లో షాపింగ్‌ గురించి మాట్లాడుతుంది. దుల్కర్‌ ఎండలో అలాగే నిలబడి పోయాడు. ఆమె ఎక్కువ టేకులు తీసుకున్నా.. దుల్కర్‌ మాత్రం ఓపికగా అలానే ఎదురు చూశాడు. నాకే కోపం వచ్చి చేతిలో ఉన్న నీళ్ల బాటిల్‌ని నేలకేసి కొట్టాను. కానీ దుల్కర్‌ మాత్రం చాలా సహనంగా ఉన్నాడు’ అని చెప్పుకొచ్చాడు. రానా వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. రానా ఆగ్రహం వ్యక్తం చేసిన హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌నే అని నెట్టింట ప్రచారం జరిగింది. ఆమెను  టార్గెట్ చేస్తూ నెగెటివ్‌ ప్రచారం చేయడంతో తాజాగా రానా ఆ హీరోయిన్‌కు సారి చెప్పాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement