పెళ్లి పీటలెక్కబోతున్న జాన్వీ..? | Is Jahnavi Going To Become Next Bride In Kapoor Family | Sakshi
Sakshi News home page

పెళ్లి పీటలెక్కబోతున్న జాన్వీ..?

Published Tue, May 8 2018 9:46 AM | Last Updated on Tue, May 8 2018 11:03 AM

Is Jahnavi Going To Become Next Bride In Kapoor Family - Sakshi

మెహంది వేడుకల్లో జాన్వీని ఆటపట్టిస్తున్న సోనమ్‌ కపూర్‌

అనిల్‌ కపూర్‌ గారాల పట్టి సోనమ్‌ కపూర్‌ వివాహం నేడు ఆనంద్‌ అహుజాతో జరుగుతున్న విషయం తెలిసిందే. ఆదివారం మెహంది వేడుకను ఎంత ఘనంగా నిర్వహించారో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూస్తే అర్థం అవుతుంది. ఈ వేడుకల్లో శ్రీదేవి కూతుళ్లు జాన్వీ, ఖుషి కపూర్‌ కూడా పాల్గొన్నారు. అయితే సోనమ్‌​ మెహంది వేడుకలకు సంబంధించిన వీడియోల్లో ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తుంది. మెహంది వేడుక సందర్భంగా సోనమ్‌ కపూర్‌ పెళ్లి కూతురు ధరించే ఎర్రని గాజులను ధరించింది. వీటిని ‘ఛుధా’ అంటారు. అలానే గాజులతో పాటు ధరించే ‘కలేరి’ని కూడా ధరించింది.

సిక్కుల విశ్వాసం ప్రకారం పెళ్లి కుమార్తె చేతికి ఉన్న ‘కలేరి’ ఏ అవివాహిత అమ్మాయి తలను తాకుతుందో ఆ అమ్మాయి వివాహమే వారి కుటుంబంలో జరగబోయే తదుపరి వివాహమని నమ్మకం. దీన్ని దృష్టిలో పెట్టుకుని సోనమ్‌ తాను ధరించిన కలేరిని జాన్వీ తలకు తాకించాలని ప్రయత్నించింది. అంటే కపూర్ల ఇంట తర్వాత పెళ్లి పీటలెక్కబోయేది జాన్వీ అనే కదా.. కానీ కలేరి జాన్వీ తలను తాకలేదు. కలేరిని  జాన్వీ తలకు తాకించడానికి ప్రయత్నిస్తూ సోనమ్‌ కపూర్‌ ‘సారీ జాను’ అన్నది ఆ వెంటనే జాన్వీ కుర్చిలో నుంచి లేచి హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement