సోనమ్ కపూర్
ఇకపై భోజన సమయాల్లో డైనింగ్ టేబుల్‌పై తప్పనిసరిగా ఉప్పు ఉండేలా చూసుకోవాలనుకుంటున్నారు సోనమ్ కపూర్. సాధారణంగా ఫ్రూట్స్, మంచి మంచి తినుబండారాల గురించి కాకుండా ప్రత్యేకంగా ఉప్పు గురించే సోనమ్ ప్రస్తావించడానికి కారణం లేకపోలేదు. సోనమ్ ‘ఐయోడిన్ లోపం’తో బాధపడుతున్నారు. అందుకే ఇక నుంచి ఉప్పు ఎక్కువగా తీసుకోవాలనుకుంటున్నారు. ‘‘వెజిటేరియన్ తినే వారందరికీ ఒక గమనిక.
ఐయోడిన్ ఉన్న సాల్ట్‌ను భోజన సమయంలో తీసుకోవడం మర్చిపోకండి. నాకు ఐడియోన్ లోపం ఉన్నట్లు ఈ మధ్యే తెలిసింది’’ అని సోనమ్ పేర్కొన్నారు. సోనమ్ శాకాహారి. వెజిటేరియన్ ఫుడ్ తీనేవారు ఎక్కువగా ఫలాలు, కాయగూరలు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటుంటారు. మాంసాహారంతో పోల్చుకుంటే వీటిలో ఉప్పు శాతం తక్కువ అంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే... సోనమ్ కపూర్ నటించిన ‘జోయా ఫ్యాక్టర్’ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరో.
Comments
Please login to add a commentAdd a comment