Iodine deficiency
-
హషిమోటో థైరాయిడైటిస్ గురించి విన్నారా? ఎందువల్ల వస్తుందంటే..
థైరాయిడ్ సమస్య అనగానే హైపర్ థైరాయిడిజమ్, హైపో థైరాయిడిజమ్లు గుర్తుకొస్తాయి. హషిమోటో థైరాయిడైటిస్ అనేది హైపో థైరాయిడిజమ్లోని ఒక సమస్య. ఇది తమ సొంత వ్యాధి నిరోధక వ్యవస్థే తమపై ప్రతికూలంగా పని చేయడం వల్ల వచ్చే ఒక రకం ఆటో ఇమ్యూన్ డిసీజ్. అందుకే దీన్ని ‘ఆటోఇమ్యూన్ హైపో థైరాయిడిజమ్’ అని కూడా అంటారు. ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం. మన దేహంలో మెడ దగ్గర సీతాకోకచిలుక ఆకృతిలో ఓ కీలకమైన థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఇది దేహంలోని అనేక రకాల జీవక్రియలకు అవసరమైన థైరాక్సిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తూ ఉంటుంది. తమ సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంథిపై వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ‘థైరాక్సిన్’ హార్మోన్ స్రావాలు తగ్గుతాయి. దాంతో అది హైపో థైరాయిడిజమ్‌కు దారితీస్తుంది. ఫలితంగా సరిపోయినంత థైరాక్సిన్ దొరకక దేహానికి అవసరమైన జీవక్రియలు జరగవు. ఈ హైపోథైరాయిడిజమ్లోని ఒకానొక కండిషన్ పేరే ‘హషిమోటో థైరాయిడైటిస్’. కారణాలు: ‘హషిమోటో థైరాయిడైటిస్’కు కారణాలు ఇంకా తెలియదు. కానీ కొన్ని జన్యుపరమైన కారణాలతో, అలాగే హార్మోన్ స్రావాల లోపాలతో ఇలా జరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. అదీగాక థైరాయిడ్ సమస్య వచ్చే మహిళల్లోని 20% మందిలో తర్వాత్తర్వాత ఈ సమస్య వచ్చే అవకాశాలూ ఎక్కువని కూడా తెలుసుకున్నారు. గతంలోనైతే ఆహారంలో అయోడిన్ లేని ఉప్పు కారణంగా ఈ సమస్య వచ్చేది. ఎందుకంటే థైరాయిడ్ బాగా పని చేయాలంటే అయోడిన్ అవసరం. పిండదశలోనే ఈ సమస్యతో మానసిక, శారీరక ఎదుగుదల లోపాలు కనిపిస్తాయి. దాన్ని ‘క్రెటినిజమ్’ అని అంటారు. అయితే ఇటీవల ఐయోడైజ్డ్ ఉప్పు లభ్యతతో... వ్యాధి రావడం తగ్గింది. కొన్ని రకాల రేడియేషన్లకు గురికావడమూ ఈ సమస్యకు దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. కొంతమందిలో థైరాయిడ్‌లో గడ్డ లేదా క్యాన్సర్ కణితి రావడంతో, దాన్ని తొలగించడంతోనూ హైపోథైరాయిడిజమ్ రావచ్చు. అయితే... ‘హషిమోటో థైరాయిడైటిస్’లో థైరాయిడ్ గ్రంథి అలాగే ఉంటుందిగానీ... దాని పనితీరు తగ్గుతూపోతుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో దీని విస్తృతి ఎక్కువ. లక్షణాలు: దీని లక్షణాలు వేర్వేరు వయసువాళ్లలో వేర్వేరుగా కనిపిస్తాయి. స్థూలంగా ఈ కింద పేర్కొన్న విధంగా ఉంటాయి. మెడదగ్గర ఉండే థైరాయిడ్ గ్రంథిలో వాపు రావడంతో మెడ ముందుభాగం ఉబ్బినట్లుగా కనిపించడం ప్రధానమైన / కీలకమైన లక్షణం హైపోథైరాయిడిజమ్‌లో థైరాయిడ్ గ్రంథి పనితీరు లోపించినప్పుడు స్థూలకాయం సాధారణం. అందువల్ల ఈ సమస్య బాధితులు బాగా బరువు పెరుగుతుంటారు నీరసం, నిస్సత్తువ, తీవ్రమైన అలసట పాలిపోయినట్లుగా కాస్త ఉబ్బినట్లుగా కనిపించే ముఖం కండరాల, కీళ్ల నొప్పులు మలబద్ధకం మహిళల్లో గర్భధారణ సమస్యలు, సంతానలేమి, యువతుల్లో ఆలస్యంగా రజస్వల కావడం, అయ్యాక నెలసరి సక్రమంగా రాకపోవడం, రుతుసమయంలో రక్తం ఎక్కువగా పోవడం వంటి ఇబ్బందులు జుట్టు రాలిపోవడం, పలచబడటం గుండె స్పందనల వేగం తగ్గడం కుంగుబాటు (డిప్రెషన్)కు గురికావడం వంటి మానసిక సమస్యలు కనిపిస్తాయి పుట్టిన పిల్లల్లో పుట్టుకతోనే (కంజెనిటల్గా) హైపోథైరాయిడిజమ్ ఉంటే వాళ్ల మెదడు పెరుగుదల మందగిస్తుంది. పిల్లల దశలోనే వస్తే వాళ్ల ఎదుగుదల దెబ్బతింటుంది. స్కూల్ చదువుల్లో పర్ఫార్మెన్స్ తక్కువగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్ధారణ: టీ3, టీ4, టీఎస్‌హెచ్ పరీక్ష చేయించినప్పుడు టీ3, టీ4 మోతాదులు నార్మల్‌గా లేదా తక్కువగానే ఉన్నప్పటికీ టీఎస్‌హెచ్ మోతాదులు ఎక్కువగా ఉంటాయి. యాంటీ–టీపీవో యాంటీబాడీస్ పరీక్షలు చేసినప్పుడు టీఎస్‌హెచ్ మోతాదులతో పాటు యాంటీ–టీపీవో యాంటీబాడీస్, యాంటీ థైరోగ్లోబ్లు్యలిన్ యాంటీబాడీస్ పరీక్షల్లో వాటి మోతాదుల్లో పెరుగుదల కనిపిస్తే దాన్ని ‘హాషిమోటో థైరాయిడైటిస్ / ఆటోఇమ్యూన్ హైపోథైరాయిడిజమ్’గా నిర్ధారణ చేయవచ్చు. డా‘‘ శ్రీనివాస్ కందుల కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ (చదవండి: సున్నపు రాయి ఇంత ప్రమాదమా? అదే ఆ తల్లికి తీరని కడుపు కోత మిగిల్చింది!) -
ఉప్పు తగ్గింది
ఇకపై భోజన సమయాల్లో డైనింగ్ టేబుల్‌పై తప్పనిసరిగా ఉప్పు ఉండేలా చూసుకోవాలనుకుంటున్నారు సోనమ్ కపూర్. సాధారణంగా ఫ్రూట్స్, మంచి మంచి తినుబండారాల గురించి కాకుండా ప్రత్యేకంగా ఉప్పు గురించే సోనమ్ ప్రస్తావించడానికి కారణం లేకపోలేదు. సోనమ్ ‘ఐయోడిన్ లోపం’తో బాధపడుతున్నారు. అందుకే ఇక నుంచి ఉప్పు ఎక్కువగా తీసుకోవాలనుకుంటున్నారు. ‘‘వెజిటేరియన్ తినే వారందరికీ ఒక గమనిక. ఐయోడిన్ ఉన్న సాల్ట్‌ను భోజన సమయంలో తీసుకోవడం మర్చిపోకండి. నాకు ఐడియోన్ లోపం ఉన్నట్లు ఈ మధ్యే తెలిసింది’’ అని సోనమ్ పేర్కొన్నారు. సోనమ్ శాకాహారి. వెజిటేరియన్ ఫుడ్ తీనేవారు ఎక్కువగా ఫలాలు, కాయగూరలు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటుంటారు. మాంసాహారంతో పోల్చుకుంటే వీటిలో ఉప్పు శాతం తక్కువ అంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే... సోనమ్ కపూర్ నటించిన ‘జోయా ఫ్యాక్టర్’ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరో. -
మీ ఒంట్లో ఉప్పుందా !
సాక్షి, హైదరాబాద్: మీ పేస్టులో ఉప్పుందా.. కూరలో ఉప్పుందా.. ఈ మాటలు ఇప్పుడు బాగా వినిపిస్తుంటాయి. ఉప్పులో అయోడిన్ ఉందా అనేది ఎక్కువ మంది పట్టించుకుంటున్నారు. కానీ ఒంట్లో ఉప్పు గురించి మాత్రం ఎవరు పట్టించు కోవడంలేదు. భవిష్యత్తుతరం అయోడిన్ లోపంతో బాధపడుతోంది. అయోడిన్ లేని ఉప్పు వినియోగంతో చిన్నారుల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. గాయిటర్, హైపోౖ థెరాయి డిజం, మరుగుజ్జుతనం, బుద్ధిమాంధ్యం సమస్యలు వీటిలో ప్రధా నంగా ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచే అయోడిన్ ఉప్పును వినియోగించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్విహిస్తోంది. అయోడిన్ లోపాన్ని నివారించేందుకు కేంద్రం రెండు దశాబ్దాల క్రితం ఉప్పుతో దీన్ని అందించాలని నిర్ణయించింది. అయోడైజ్డ్ ఉప్పును అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ సంప్రదాయ పరిస్థితుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో బస్తాల్లో లభ్యమయ్యే ఉప్పునే వినియోగిస్తున్నారు. తగ్గుతోన్న ఉప్పు వినియోగం... స్థూలకాయం సమస్యపై ఆందోళనతో ఇటీవల పట్టణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు పిల్లలకు ఉప్పు వినియోగాన్ని తగ్గిస్తున్నారు. ఫలితంగా అయోడిన్ లోపంతో ఉండే చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం అయోడిన్ ఉప్పు వినియోగ కార్యక్రమ ఫలితాలపై ఎప్పటికప్పుడు అంచనా నివేదికలు రూపొందిస్తోంది. చిన్నా రుల్లో అయోడిన్ లోపాలపై తాజాగా సర్వే నిర్వహించింది. తెలంగాణలోని చిన్నారుల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలో వినియోగించే ఉప్పు నమూనాలను సేకరించి అయోడిన్ శాతంపై పరీక్షలు నిర్వహించింది. రాష్ట్రంలోని పాత జిల్లాల ప్రాతిపదికగా నిర్వ హించిన ఈ సర్వేలో మొత్తం 2,050 ఉప్పు నమూనాలను పరీక్షించారు. 30 శాతం నమూనాల్లో అయోడిన్ ఆనవాళ్లు ఏ మాత్రం లేవని తేలింది. 20 శాతం ఉప్పు నమూనాల్లో మోతాదు కంటే తక్కువగా అయోడిన్ ఉన్న ట్లుగా నిర్ధారణ అయ్యింది. అయోడిన్ ఉప్పు వినియోగంపై అవగాహన లేక పోవడం వల్లే ఈ సమస్య ఉందని సర్వే నిర్వా హకులు గుర్తించారు. మొత్తంగా అయో డిన్‌లేని ఉప్పును తీసుకునేవారు ఎక్కువ మంది ఉంటున్నారు. అటవీ ప్రాంతాల్లోని చిన్నారుల్లో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంది. అయోడిన్ లోపం వల్ల పిల్లల్లో గాయిటర్ (గొంతు ఉబ్బడం), కంటి చూపులోపం హైపోథైరాయిడ్, మరు గుజ్జుతనం, బుద్ధి మాంధ్యం రుగ్మతలు వస్తున్నాయి. గాయిటర్ (గొంతు ఉబ్బడం), కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న చిన్నా రులు తొమ్మిది శాతం ఉన్నట్టు తేలింది. గ్రామీణ ప్రాంత మహిళల్లోనూ అయోడిన్ లోపం బాధితులు ఉన్నట్లు సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. -
ఆరోగ్యానికి బొట్టు బిళ్ల
నుదుటన దిద్దుకునే బొట్టు సింగారానికి మాత్రమే కాదు, ఇక పై ఎంతోమంది స్త్రీలకు ఆరోగ్యాన్ని, జీవితాన్ని ప్రసాదించబోతోంది. రోజు రోజుకి దేశంలో పెరుగుతున్న అయోడిన్ లోపం వలన స్త్రీలు, వారికి పుట్టబోయే పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలకు లోనవుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు గాను సింగపూర్‌కు చెందిన గ్రే గ్రూప్, నాసిక్‌లోని నీల్‌వసంత్ మెడికల్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ కలిసి ఈ బిందీ రూపకల్పన చేశారు. దాదాపు ఏడు కోట్లమందికి పైగా భారతీయులు అయోడిన్ లోపంతో బాధ పడుతున్నట్లు జాతీయ స్థాయి లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్, బ్రెస్ట్ క్యాన్సర్, ఫైబ్రాయిడ్స్‌కి దారితీసే అవకాశం ఉండగా, పుట్టబోయే పిల్లలు మానసిక ఎదుగుదల సక్రమంగా జరుగకపోవచ్చని వైద్యులు అంటున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో అయోడిన్ లోపంతో బాధపడుతున్న గ్రామీణ మహిళల కోసం ‘లైఫ్ సేవింగ్ డాట్’ పేరుతో సింగపూర్‌కి చెందిన గ్రే గ్రూప్ పైన పేర్కొన్న బిందీని రూపొందించింది. అయోడిన్ లోపాన్ని అధిగమించడానికి పోషకాహార ఔషధాలను కొనుగోలు చేయలేని గ్రామీణ స్త్రీలకు ఈ బిందీలు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించనున్నాయి. అయోడిన్ మందులకు అయ్యే ఖర్చు భరించలేని మహిళలకు ఈ బిందీలను త్వరలోనే దేశవ్యాప్తంగా అందచేస్తారు. 100-150 మైక్రో గ్రాముల అయోడిన్‌తో తయారు చేసిన ఈ బిందీ ప్యాచ్‌లను రోజులో 8 గంటలు పెట్టుకుంటే చాలు, ఒక రోజుకు కావలసిన అయోడిన్‌ను స్త్రీలు పొందగలుగుతారు. ఇటీవలే ప్రయోగాత్మకంగా మహారాష్ట్రలోని మూడు ఆదివాసీ ప్రాంతాలలో ఈ బిందీలను ఆరోగ్య శిబిరాల ద్వారా సప్లై చేశారు. - ఓ మధు -
అయోడిన్ కిట్టు..వాడితే ఒట్టు
* రెండేళ్లుగా నిలిచిన అయోడిన్ కిట్ల పంపిణీ * గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్లో అయోడిన్ లోపం * గుర్తించడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలం * అవగాహన ర్యాలీలతో సరి ఒంగోలు సెంట్రల్ : అయోడిన్..శరీరానికి అత్యావశ్యకమైన పోషకం. ప్రతి మనిషికి రోజూ 150 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరం. ప్రకృతి ద్వారా లభించాల్సిన ఈ పోషకం వాతా వరణ కాలుష్యంతో శరీరానికి అందడం లేదు. అయోడిన్ ఉన్న ఉప్పును ఆహారంలో తీసుకుంటే.. ఆ లోపాన్ని భర్తీచేయొచ్చు. కానీ అవగాహన లోపంతో గ్రామీణ ప్రాంతాల్లో అయోడిన్ ఉప్పును వాడటం లేదు. ఫలితంగా జిల్లాలోని అధిక శాతం మంది పిల్లల్లో అయోడిన్ లోపం ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. ఆ పిల్లలు గాయిటర్ అనే గొంతు సంబంధిత వ్యాధికి గురవుతున్నారు. మరికొందరు బుద్ధిమాంద్యులుగా మారుతున్నారు. ప్రచారమే తప్ప..పరీక్షలేవీ.. అయోడైజ్డ్ ఉప్పును మాత్రమే వాడండి. ఆరోగ్యానికి అయోడిన్ మంచిదంటూ ప్రకటనలు, ర్యాలీలతో ఊదరగొట్టే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు..అయోడిన్ లోపాన్ని గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వైద్య సిబ్బందికి పదే ళ్ల క్రితం నుంచి వైద్యాధికారులు అయోడిన్ పరీక్ష కిట్లు పంపిణీ చేస్తున్నా సిబ్బంది వాటిని వినియోగించడం లేదు. దీంతో ఎలాగూ వాటిని వాడటం లేదని భావించిన అధికారులు రెండేళ్ల నుంచి సరఫరా నిలిపేశారు. చేయాల్సిందిదీ... పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనంలో..ఇళ్లలో వినియోగించే ఉప్పులోని అయోడిన్ శాతాన్ని పరీక్షించి పిల్లల తల్లిదండ్రులకు ఆహార పరంగా సలహాలు ఇవ్వాలి. జిల్లాలో 920 పంచాయతీలుండగా అదే సంఖ్యలో ఆరోగ్య ఉప కేంద్రాలు, పీహెచ్‌సీల్లో అయోడిన్ పరీక్ష కిట్లు ఉంటాయి. గ్రామ స్థాయిలో ఆరోగ్యసేవలందించే ఏఎన్ఎంలకు వీటిని అంది స్తారు. వీరికి ఆశ కార్యకర్తలు కూడా సహకరిస్తారు. డ్వాక్రా సంఘాలను కూడా భాగస్వాములను చేశారు. ప్రతి ఇంట్లో వాడుతున్న ఉప్పు శాతాన్ని గుర్తించడానికి ద్రావకంతో కూడిన కిట్లు అందిస్తున్నారు. ఆ ద్రావకాన్ని ఉప్పులో వేస్తే మారే రంగు ఆధారంగా అయోడిన్ శాతాన్ని గుర్తిస్తారు. ఆ మోతాదులో ఎంత అయోడిన్ అవసరమో ప్రజలకు వైద్య సిబ్బంది సూచించాలి. గ్రామాల్లో ఎక్కువ శాతం ప్రజలు గళ్ల ఉప్పును వాడుతున్నారు. దీని వలన శరీరానికి కావాల్సిన అయోడిన్ లభించడంలేదు. ఈ విషయాలన్నింటిపై అవగాహన కల్పించేందుకు వైద్య సిబ్బందికి తర్ఫీదు ఇచ్చారు. అయితే అయోడిన్ కిట్లను సిబ్బంది ఏ రోజూ వాడిన దాఖలాలు లేవు. దశాబ్ద కాలం పాటు సరఫరా చేసిన కిట్లు ఉప కేంద్రాల్లో నిరుపయోగంగా ఉన్నా యి. ఫలితంగా కిట్ల సరఫరాను సైతం ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో అయోడిన్ లోపం తెలుసుకోవడం కష్టతరంగా మారింది. కిట్ల సరఫరా నిలిచింది వాస్తవమే.. కే చంద్రయ్య, డీఎంహెచ్‌వో అయోడిన్ లోపం తెలుసుకునేందుకు గతంలో కిట్లు సరఫరా చేసేవారు. అయితే ప్రస్తుతం వాటిని ఇవ్వడం లేదు. అయోడిన్ లోపంపై ప్రజలకు అవగాహన కల్పించేం దుకు మంగళవారం ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీలో వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డెరైక్టర్ రాజేంద్రప్రసాద్, డైరక్టరేట్ హెల్త్ ఇన్చార్జ్ డాక్టర్ గీతా ప్రసాదిని పాల్గొంటారు.