వారంతా పని లేని వారే : సోనమ్‌ | Sonam Kapoor Responds On Trolling In Social media | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 3 2018 11:53 AM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Sonam Kapoor Responds On Trolling In Social media - Sakshi

ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియాలో వచ్చే కామెంట్స్‌, నెటిజన్లు చేసే ట్రోలింగ్‌లు సెలబ్రెటిలకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఇలాంటి ట్రోలింగ్‌లకు, కామెంట్స్‌ను నేను పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చింది అనిల్‌ కపూర్‌ గారాలపట్టి సోనమ్‌కపూర్‌. ఇటివలే వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాను వివాహామాడిన ఈ సుందరి తాజాగా ‘వీరే దీ వెడ్డింగ్‌’ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. 

ఈ మూవీ మొదటిరోజే పదికోట్ల కలెక్షన్స్‌ సాధించి విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచింది. అజయ్‌ దేవ్‌గణ్‌ రెయిడ్‌, అక్షయ్‌కుమార్‌ ప్యాడ్‌మాన్‌ మూవీ తర్వాత ఐదో చిత్రంగా వీరే దీ వెడ్డింగ్‌ కలెక్షన్స్‌లో టాప్‌లో ఉంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పాల్గొ‍న్న సోనమ్‌ కపూర్‌ను.. మంగళసూత్రం చేతికి ధరించడం వల్ల సోషల్‌మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై ప్రశ్నించగా.. ట్రోలింగ్‌ చేసే వారంతా పనిలేని వారే. అలాంటి వారు చేసే కామెంట్స్‌కు నేను బాధపడను అని సమాధానమిచ్చింది. ఈ మూవీలో కరీనా కపూర్‌, సోనమ్‌ కపూర్‌, స్వరా భాస్కర్‌, శిఖాలు ప్రధాన పాత్రల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement