కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కొత్త పెళ్లి కూతురు సోనమ్ జిల్‌జిగేల్‌మనించారు. వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను పెళ్లాడిన వెంటనే కేన్స్ ఫెస్టివల్‌లో వాలిపోయిన ఈ అమ్మడు, కలర్‌ఫుల్ గౌన్లలో దర్శనమిస్తూ తొలి రోజు నుంచి చూపర్లకు మతి పోగొట్టారు. ఇక చివరి రోజు కేన్స్ ఫెస్టివల్‌లో ఈ అమ్మడుకు స్పెషల్ సర్‌ప్రైజే అందింది. సోనమ్ ఎండోర్సస్ చేసుకున్న కాస్మోటిక్ బ్రాండ్ స్పెషల్ కేక్ కటింగ్ వేడుకతో ఈ నటికి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎల్ ఓరియల్ అనే కాస్పొటిక్ బ్రాండ్ తరుపున ప్రస్తుతం సోనమ్ కేన్స్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. పెళ్లి అయిన తర్వాత వెంటనే తమ సంస్థ తరుఫున ఫెస్టివల్‌లో పాల్గొనడంతో, సోనమ్ కపూర్ చేత పెళ్లి కానుకగా అతిపెద్ద కేక్‌ను కటింగ్ చేయించారు. ఈ కేక్‌ను లిప్‌స్టిక్‌లతో అలకరించారు.
ఎల్ ఓరియల్ ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్‌ను సోనమ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన భర్త ఆనంద్ ఆహుజాకు ట్యాగ్ చేస్తూ...‘ఇది మనకోసం’ అని పోస్టు చేశారు. కేన్స్ ఫెస్టివల్ అనంతరం సోనమ్ త్వరలో థియేటర్లలోకి రాబోతున్న ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా ప్రమోషన్‌లో పాల్గొననున్నారు. సోనమ్‌తో పాటు ఈ సినిమాలో కరీనా కపూర్, స్వరా భాస్కర్, శిఖాలు ప్రధాన పాత్రల్లో నటించారు. భిన్న మనస్తత్వాలు కలిగిన నలుగురు యువతుల జీవితాల్లో చోటు చేసుకున్న సంఘటనలు, వారు ఎదుర్కొన్న పరిణామాల సమాహారమే ఈ సినిమా. జూన్ 1న ఈ సినిమా విడుదల కాబోతుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సోనమ్ పాల్గొనడం ఇది ఎనిమిదో సారి.
Comments
Please login to add a commentAdd a comment