సోనమ్.. సో స్వీట్‌గా.. ఐష్.. సో సోగా! | For Bollywood in Cannes, there's life beyond Aishwarya Rai, Sonam Kapoor | Sakshi
Sakshi News home page

సోనమ్.. సో స్వీట్‌గా.. ఐష్.. సో సోగా!

Published Mon, May 16 2016 12:38 AM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

సోనమ్.. సో స్వీట్‌గా.. ఐష్.. సో సోగా!

సోనమ్.. సో స్వీట్‌గా.. ఐష్.. సో సోగా!

కాన్స్ చలన చిత్రోత్సవాల్లో మొదటి రోజు ఐశ్వర్యా రాయ్ అందర్నీ కనువిందు చేశారు. కానీ, రెండో రోజు మాత్రం మైనస్ మార్కులు తెచ్చుకున్నారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో ఆమె నటించిన ‘సరబ్‌జిత్’ చిత్రం ప్రీమియర్ షో ఆదివారం  జరిగింది. ఈ షోలో పాల్గొనేందుకు ఆ చిత్రదర్శకుడు ఒమంగ్ కుమార్, చిత్రంలో కీలక పాత్ర చేసిన రిచా చడ్డా తదితరులు వెళ్లారు. ఐష్ నలుపు, బంగారు వర్ణంతో తయారు చేసిన పొడవాటి గౌను వేసుకున్నారు. డ్రెస్‌కి వాడిన మెటీరియల్ కొంచెం మందంగా ఉండటంతో ఆమె బొద్దుగా కనిపించారు.

దాంతో రెండో రోజు మైనస్ మార్కులు పడ్డాయి. మరోవైపు యంగ్ బ్యూటీ సోనమ్ కపూర్ మాత్రం ఫుల్ మార్కులు కొట్టేశారు. నీలం, నలుపు రంగు చీరలో సోనమ్ చాలా క్యూట్‌గా కనిపించారు. ఫ్యాషన్ విషయంలో ఐష్‌కీ, సోనమ్‌కీ  ఎప్పుడూ... ముఖ్యంగా కాన్స్ ఉత్సవాల్లో పోటీ ఉంటుంది. ఎప్పుడూ సోనమ్‌కే మంచి మార్కులు పడుతుంటాయి. ఈసారి కూడా అదే జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement