విదేశాలకు వెళ్లి తప్పు చేసిందా?!
గాసిప్
ఆధునిక ఫ్యాషన్స్ అచ్చంగా ఫాలో అవుతుంది బాలీవుడ్ భామ సోనమ్ కపూర్. తలకు పెట్టుకునే క్లిప్పు దగ్గర్నుంచి కాలికి తొడిగే జోడు వరకూ అన్నింట్లోనూ వైవిధ్యతను చూపిస్తుంది. అయితే ఫ్యాషన్ పట్ల ఆమె ఆసక్తి మరీ మితిమీరింది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దానికి కారణం తాజాగా పలు వెబ్‌సైట్లలో కనిపించిన ఫొటోలు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్లిన సోనమ్... అక్కడ ఓ వెస్టర్న్ డ్రెస్ వేసుకుని ఫొటోకి ఫోజిచ్చింది. అది నెట్‌లో పోస్ట్ అయ్యింది.
ఆమె అందాల్ని దాదాపుగా బహిర్గతం చేసిన ఆ డ్రెస్‌ని చూసి చాలామంది భారతీయులు భగ్గుమన్నారు. స్టైల్‌గా ఉండటంలో తప్పు లేదు కానీ ఇలా విదేశాలకు వెళ్లి మరీ పరువు తీయడం ఏం బాలేదు, ఇది చాలా తప్పు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి అవి సోనమ్ వరకూ వెళ్లాయో లేదో!