ఆ సూపర్‌స్టార్‌ షో నాకు అస్సలు నచ్చదు! | I do not like Bigg Boss, says director | Sakshi
Sakshi News home page

ఆ సూపర్‌స్టార్‌ షో నాకు అస్సలు నచ్చదు!

Published Wed, Dec 14 2016 12:29 PM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM

ఆ సూపర్‌స్టార్‌ షో నాకు అస్సలు నచ్చదు!

ఆ సూపర్‌స్టార్‌ షో నాకు అస్సలు నచ్చదు!

ముంబై: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌, ప్రముఖ దర్శకుడు సూరజ్‌ బర్జాత్యా మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ ఇద్దరూ కలిసి  ‘మైనే ప్యార్‌ కియా’, ‘హమ్‌ ఆప్‌కే హై కౌన్‌’  నుంచి గత సంవతర్సం వచ్చిన ‘ప్రేమరతన్‌ ధన్‌పాయో’ సినిమా వరకు సూపర్‌హిట్లు అందించారు. నిజానికి బర్జాత్యా తీసిన ఎక్కువ సినిమాల్లో సల్మానే హీరో. అయిన ఈ కండలవీరుడు హోస్ట్‌గా ఉన్న ‘బిగ్‌ బాస్‌’ రియాలిటీ షో తనకు అస్సలు నచ్చదని దర్శకుడు బర్జాత్యా కుండబద్దలు కొట్టారు.

‘నాకు ‘బిగ్‌బాస్‌’ షో నచ్చదు. నేను దానిని (సల్మాన్‌ వ్యాఖ్యాతగా కనిపించే వీకెండ్‌ వార్‌ ఎపిసోడ్‌ను) అసలే చూడను. నిజానికి టీవీని నేను పెద్దగా చూడను. న్యూస్‌ షోలు అప్పుడప్పుడు చూస్తుంటాను. శక్తి, శనీ వంటి టీవీ సీరియళ్లు చూస్తుంటాను’ అని బర్జాత్యా విలేకరులతో అన్నారు. తన తాజా టీవీ షో ’ఎక్‌ స్వాభిమాన్‌’  లాంచ్‌ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సల్మాన్‌ బిగ్‌బాస్‌ షో గురించి ప్రశ్నించగా బర్జాత్యా ఈవిధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement