కమల్‌హాసన్‌ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ | Amitabh Bachchan To Play Key Role In Kamal Haasan Vikram Movie | Sakshi
Sakshi News home page

కమల్‌హాసన్‌ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌

Published Sat, Mar 26 2022 8:12 AM | Last Updated on Sat, Mar 26 2022 8:17 AM

Amitabh Bachchan To Play Key Role In Kamal Haasan Vikram Movie - Sakshi

కమల్‌హాసన్‌ తాజా సినిమా ‘విక్రమ్‌’లో అమితాబ్‌ బచ్చన్‌ అతిథిగా కనిపిస్తారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. కమల్‌హాసన్‌ , విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘విక్రమ్‌’. పొలిటికల్‌ డ్రామాకు గ్యాంగ్‌స్టర్‌ టచ్‌తో సాగే ఈ చిత్రానికి లోకేష్‌ కనగరాజ్‌ దర్శకుడు.

ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌  అతిథిగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ సీన్‌ క్లైమాక్స్‌లో వస్తుందట. ఈ ఏడాది జూన్‌  3న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement