ఆ ఇద్దరు కాదు.. స్టార్‌ హీరో సినిమాలో బాలీవుడ్ భామ..! | Huma Qureshi To Act In Tamil Star Hero Ajith Kumar Next Movie - Sakshi
Sakshi News home page

Huma Qureshi: ఆ సూపర్ హిట్ కాంబో రిపీట్ కానుందా?

Published Mon, Sep 4 2023 7:56 AM | Last Updated on Mon, Sep 4 2023 9:35 AM

Huma Qureshi Will Acts In Tamil Star Hero Ajith Kumar Movie - Sakshi

సినిమా రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. దీనికి తమిళ స్టార్ హీరో అజిత్‌ కొత్త చిత్రమే ఉదాహరణ. వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు అజిత్‌ ఇటీవల నటించిన తుణివు(తెగింపు) చిత్రం విడుదలై దాదాపు ఏడాది కావస్తోంది. ఆ  తర్వాత చిత్రం గురించి ప్రకటించి కూడా చాలా నెలలు అవుతోంది. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విడాముయిర్చి అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఇప్పటికీ ఆ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లలేదు. ఈ లోగా దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ చిత్రం నుంచి వైదొలిగారు. ఆ తరువాత దర్శకుడు మగిళ్‌ తిరుమేణి పేరు తెరపైకి వచ్చింది. 

(ఇది చదవండి: ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి.. నవీన్ పోలిశెట్టి ఆసక్తికర కామెంట్స్! )

దీంతో ఇక మిగిలింది షూటింగ్‌ ప్రారంభించడమే అనుకున్నారు. అతే విడాముయిర్చి చిత్రానికి ఇంకా ముహూర్తం కుదరలేదు. అజిత్‌ బైక్‌ విదేశీ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. దీంతో విడాముయిర్చి చిత్రం ఆగిపోయిందనే ప్రచారం పెద్దఎత్తున వైరలైంది. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్‌ చిత్రం ఆగిపోలేదని.. త్వరలోనే ప్రారంభం అవుతుందని నిర్మాత సుభాస్కరన్‌ ఇటీవల స్పష్టం చేశారు.

హీరోయిన్‌ ఎవరు?
ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో మొదట నటి త్రిష నాయకిగా నటించనున్నారనే ప్రచారం జరిగింది. ఆ తరువాత ఆమె వైదొలిగారనే ప్రచారం జోరందుకుంది. అలాగే మలయాళ నటి మంజు వారియర్‌ పేరు కూడా వినిపించింది. తాజాగా బాలీవుడ్‌ భామ హ్యుమా ఖురేషీని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. ఈమె ఇంతకుముందే అజిత్‌తో వలిమై చిత్రంలో నటించారు. చివరికీ హ్యుమా ఖురేషీ పేరన్న ఫైనల్‌ అవుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. 

(ఇది చదవండి: ‘తగ్గేదేలే’ అంటున్న నవీన్‌ పోలిశెట్టి, ఇప్పుడు అమెరికాలో కూడా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement