సినిమా: రజనీకాంత్ హీరోయిన్ ఇప్పుడు సిద్ధార్థ్‌తో జత కట్టడానికి సిద్ధం అవుతోంది. రజనీకాంత్‌కు జంటగా కాలా చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన బాలీవుడ్ నటి హ్యూమాఖురేషీ. ఆ చిత్రంతో కోలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశించిన ఈ అమ్మడికి నిరాశే ఎదురైంది. కాలా చిత్రం తరువాత తమిళంలో హ్యూమా ఖురేషీని పట్టించుకున్నవారే లేరు. ఇక ఆ మధ్య విజయాల పరంగా కాస్త వెనుక పడ్డ నటుడు సిద్ధార్థ్ అవళ్ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం మలయాళంలో కమ్మర శపథం చిత్రంలో నటిస్తున్న ఈయన తమిళంలో కార్తీక్ జీ.క్రిస్ దర్శకత్వంలో సైతాన్ కే బచ్చా చిత్రంతో పాటు సాయిశేఖర్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. దర్శకుడు శశి నూతన చిత్రంలో కూడా సిద్ధార్థ్ హీరోగా నటించడానికి కమిట్ అయ్యారు.
మొత్తం మీద తమిళం, మలయాళం భాషా చిత్రాలతో బిజీగా ఉన్న సిద్ధార్థ్ తాజాగా బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషీతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇది సినిమా కాదు. ఒక వెబ్ సీరియల్. బాలీవుడ్ దర్శకుడు దీపా మెహతా హిందీలో రూపొందిస్తున్న ఇందులో సిద్ధార్థ్, హ్యూమాఖరేషీ జంటగా నటించనున్నారని సమాచారం. సిద్ధార్థ్ ఇంతకు ముందే దీపా మెహతా దర్శకత్వంలో మిడ్‌నైట్స్ సిల్రన్ అనే హిందీ చిత్రంలో నటించారన్నది గమనార్హం. దీంతో సిద్ధార్థ్, హ్యూమాఖురేషీలతో తెరకెక్కించనున్న వెబ్ సీరియల్‌పై అంచనాలు పెరుగుతున్నాయట.
Comments
Please login to add a commentAdd a comment