‘సైరా’లో ‘కాలా’ గర్ల్‌ఫ్రెండ్‌ | Huma Qureshi Roped Sye Raa For A Key Role | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 26 2018 11:11 AM | Last Updated on Tue, Jun 26 2018 11:11 AM

Huma Qureshi Roped Sye Raa For A Key Role - Sakshi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి.ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో దక్షిణాది నటులతో పాటు ఉత్తరాది స్టార్లు కూడా కనిపించనున్నారు. ఇప్పటికే బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌కు సంబంధించిన సీన్స్‌ను చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వేసిన భారీ సెట్స్‌లో యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను చిత్రీకరిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా తారల జాబితాలో మరో బాలీవుడ్ నటి వచ్చి చేరారు. ఇటీవల కాలా సినిమాతో సినిమాతో సౌత్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన బ్యూటీ హుమా ఖురేషీ. ఈ సినిమాలో రజనీ ప్రియురాలిగా నటించిన హుమా, సైరాలో నటించేందుకు అంగీకరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ ధృవీకరించాల్సి ఉంది. చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌ పై మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement