స్లో అండ్‌ స్టడీ | Huma Qureshi horse riding for Sye Raa | Sakshi
Sakshi News home page

స్లో అండ్‌ స్టడీ

Published Sat, Jun 30 2018 1:37 AM | Last Updated on Thu, Sep 19 2019 8:25 PM

Huma Qureshi horse riding for Sye Raa - Sakshi

హ్యూమా ఖురేషీ

ఉదయాన్నే ఖాళీ ప్లేస్‌లో రౌండ్స్‌ కొడుతున్నారు హీరోయిన్‌ హ్యూమా ఖురేషీ. రన్నింగ్‌ రౌండ్సా? డ్రైవింగ్‌  రౌండ్సా? అంటే.. రెండూ కాదు.. గుర్రంపై రౌండ్స్‌ వేస్తున్నారు. తాజాగా ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు. ‘‘ఉదయాన్నే గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాను. స్లో అండ్‌ స్టడీగా నేర్చుకుని ఆ నెక్ట్స్‌ స్పీడ్‌ పెంచుతా’’ అని పేర్కొన్నారు హ్యూమా.

సడన్‌గా ఆమె గుర్రపు స్వారీ ఎందుకు నేర్చుకుంటున్నారు? అంటే ‘సైరా’ చిత్రం కోసమనే వార్తలు వినిపిస్తున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మిస్తోన్న సినిమా ‘సైరా’. నయనతార కథానాయిక. అమితాబ్, తమన్నా, విజయ్‌సేతుపతి, సుదీప్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం హ్యూమాను సంప్రదించారట. అందుకే క్యారెక్టర్‌ కోసం ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారని టాక్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement