చిరంజీవి
లాఠీలు, తూటాలతో బ్రిటీష్ పోలీసులు ఒకవైపు, బాకులు, బరిసెలతో సమరయోధులు ఇంకోవైపు. ఒకరిది అధిపత్య పోరు. మరొకరిది స్వాతంత్య్ర సమరం. నడి రాత్రి బ్రీటిష్ సైన్యానికి, ‘సైరా’ టీమ్‌కి జరిగిన యుద్ధ నేపథ్యం ఇది. మరి.. ఈ పోరాటం ఏ స్థాయిలో జరిగిందనేది వెండితెరపై చూడాల్సిందే. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘సైరా’.
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను చిరంజీవి తనయుడు, హీరో రామ్‌చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలకమైన షెడ్యూల్ గురువారం కంప్లీటైందని చిత్రబృందం పేర్కొంది. ‘‘దాదాపు 35 రాత్రుల పాటు షూటింగ్ జరిపి చాలెంజింగ్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశాం. ‘సైరా’ సెట్‌లో బ్రిటిష్ సైన్యంతో మాత్రమే కాదు. రెయిన్‌తో కూడా ఫైట్ సాగింది. సూపర్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాం’’ అని ఈ చిత్రం కెమెరామెన్ రత్నవేలు పేర్కొన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment