Australian Chef Gary Mehigan seeks consent before kissing Huma Qureshi - Sakshi
Sakshi News home page

Huma Qureshi: ముద్దుపెట్టాడు.. కానీ మెచ్చుకుంటున్నారు!

Published Wed, Jul 5 2023 9:23 PM | Last Updated on Thu, Jul 6 2023 9:03 AM

Chef Gary Mehigan Huma Qureshi Kiss Video - Sakshi

సెలబ్రిటీలకు ప్రస్తుతం ప్రైవసీ అనేది లేకుండా పోయింది. ఎక్కడున్నా, ఏం చేస‍్తున్నా వాళ్ల అనుమతి లేకుండానే నిమిషాల్లో ఫొటోలు, వీడియోలు వైరల్ అయిపోతున్నాయి. సదరు నటీనటులు పబ్లిక్ ప్లేసుల‍్లో ఉన్నప్పుడైతే అభిమానులం అని చెప్పి కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఓ వ్యక్తి మాత్రం స్టార్ హీరోయిన్‌ని అడిగి మరీ ముద్దుపెట్టాడు.

బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషి ప్రస్తుతం 'తర్లా' సినిమా చేసింది. ఇది జీ5 ఓటీటీలో జూలై 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ముంబయిలో ఓ ఈవెంట్ నిర్వహించగా, దీనికి మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా షో మాజీ జడ్జి గ్యారీ మైగెన్ హాజరయ్యారు. హ్యుమాతో ఫొటోలకు పోజిలిచ్చారు. అలానే ముద్దుపెట్టుకోవచ్చా అని అడిగారు. ఆమె ఓకే చెప్పడంతో హ్యుమా బుగ్గపై ముద్దుపెట్టారు. ఇలా అనుమతి తీసుకుని కిస్ చేయడంపై ఇతడిని మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. 

'తర్లా' కథేంటి?
తర్లా దలాల్.. మనదేశంలోనే చాలా గుర్తింపు తెచ్చుకున్న ఓ మహిళ చెఫ్. తన సింపుల్ చిట్కాలతో ఎన్నో అద్భుతమైన వెజిటేరియన్ వంటకాలు చేశారు. వాటిని పుస్తకాల‍్లో పొందుపరిచి, జనాలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆమె కథతోనే 'తర్లా' సినిమా తీశారు. ఇందులో హ్యుమా ఖురేషీ టైటిల్ రోల్ లో నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. మూవీపై ఆసక్తిని పెంచుతోంది. 


(ఇదీ చదవండి: జ్యువెల్లరీ యాడ్‌లో సితార.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement