‘సినిమాలో ఆ సన్నివేశాలు చాలా స్పెషల్‌’ | i learnt many things from Rajini sir, says Huma Qureshi | Sakshi
Sakshi News home page

‘సినిమాలో ఆ సన్నివేశాలు చాలా స్పెషల్‌’

Published Wed, Sep 20 2017 6:57 PM | Last Updated on Thu, Sep 21 2017 1:39 PM

‘సినిమాలో ఆ సన్నివేశాలు చాలా స్పెషల్‌’

‘సినిమాలో ఆ సన్నివేశాలు చాలా స్పెషల్‌’

చెన్నై : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నుంచి నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయంటోంది నటి హుమా ఖురేషీ. మోడలింగ్‌ రంగం నుంచి బుల్లి తెరకు ఆపై వెండితెరకు పరిచయం అయిన ఈ ఢిల్లీ బ్యూటీ 2012లో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వస్సేపూర్‌’ చిత్రంతో కథానాయకిగా రంగప్రవేశం చేసింది. తొలి చిత్రంతోనే బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించిన హుమాఖురేషీ పలు హిందీ, ఆంగ్ల పత్రికల ముఖ చిత్రాలకు గ్లామరస్‌గా ఫొటోలు దిగి మరింత పాపులర్‌ అయింది. గత ఐదేళ్లలోనే 20 చిత్రాల వరకూ నటించేసిన హుమా.. ఇప్పటికే దక్షిణాదిలో కూడా రౌండ్‌ కొట్టేస్తోంది.

గత ఏడాది మలయాళంలో మమ్ముట్టితో జత కట్టిన ఈ భామ తాజాగా మన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాజా చిత్రం కాలాలో నటించే అవకాశాన్ని కొట్టేసిన సంగతి తలిసిందే. కబాలి చిత్రం తరువాత రజనీకాంత్‌ మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన అల్లుడు, నటుడు ధనుష్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పా.రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న కాలా చిత్రంలో సముద్రకని, అంజిలి పాటిల్, శాయాజీ షిండే తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతాన్ని అందిస్తున్న కాలా చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది.

ఈ సందర్భంగా కాలా చిత్రంలో నటించడం గురించి హ్యూమఖరేషీ పేర్కొంటూ రజనీకాంత్‌ అంతటి సూపర్‌స్టార్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందని అంది. అసలు ఆయనతో నటించే అవకాశం రావడమే ఘనంగా భావిస్తున్నానీ, కాలా చిత్రంలో తాను రజనీకాంత్‌తో నటించే సన్నివేశాలు చాలా స్పెషల్‌గా ఉంటాయనీ చెప్పింది. రజనీకాంత్‌ నుంచి నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయనీ, ఈ చిత్రంలో నటించడం ద్వారా తానూ చాలా పాఠాలు నేర్చుకుంటున్నాననీ హుమా ఖురేషీ చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement