
హ్యూమా ఖురేషి
‘మీటు’ ఉద్యమం వెలుగులోకొచ్చాక ఇండస్ట్రీలో చాలా మంది తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడి, ఈ సంస్కృతిని నివారించే ప్రయత్నం చేస్తున్నారు. హాలీవుడ్‌లో మొదలైన ఈ ఉద్యమం ఇండియన్ ఇండస్ట్రీ వరకూ విస్తరించింది. కానీ మీటు ఉద్యమం బాలీవుడ్‌లో అంతగా విజయవంతం కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు బాలీవుడ్ భామ ‘హ్యూమా ఖురేషి’. ఈ విషయం గురించి హ్యూమా మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్‌లో ఈ ఉద్యమం అంత గొప్పగా విజయవంతం కావడానికి కారణం ఈ వేధింపుల మీద మాట్లాడిన హీరోయిన్లంతా సీనియర్లు, చాలా రెస్పెక్ట్ ఉన్నవారు. బాలీవుడ్‌లో కూడా ఇలా టాప్ హీరోయిన్స్ మాట్లాడగలిగినప్పుడే ఈ ఉద్యమం ఇంకా సక్సెస్ అవుతుంది. ఇలాంటి ఉద్యమాలకు పెద్ద గొంతులే కీలకం. చిన్న చిన్నవాళ్లు నోరు విప్పితే దాని ప్రభావం కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. అలాగే మీటు అనేది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే జరగాలని కాదు. ప్రతి వర్కింగ్ ప్లేస్‌లో ఇది జరగాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారామె.
Comments
Please login to add a commentAdd a comment