వెంకీకి జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ | Venkatesh To Romance With Huma Qureshi | Sakshi
Sakshi News home page

Published Thu, May 31 2018 2:05 PM | Last Updated on Thu, May 31 2018 3:18 PM

Venkatesh To Romance With Huma Qureshi - Sakshi

గురు సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న విక్టరీ వెంకటేష్‌, వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్‌ 2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు వెంకీ. ఈ సినిమాలో యంగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌తో కలిసి నటించనున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ఈ సినిమాతో మరో క్రేజీ మల్టీస్టారర్‌కు ఓకె చెప్పారు వెంకీ.

జై లవ కుశ సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టిన బాబీ(కె.యస్‌. రవీంద్ర) దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. మల్టీ స్టారర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో వెంకీ, చైతూలు మామ అల్లుళ్లుగానే నటిస్తుండటం విశేషం. ఈ సినిమాలో వెంకీకి జోడిగా బాలీవుడ్‌బ్యూటీ నటించనుందన్న ప్రచారం జరుగుతోంది.

కాలా సినిమాలో రజనీకాంత్‌ ప్రేయసిగా నటించిన హుమా ఖురేషీ, వెంకీకి జోడిగా నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement