రెండు పడవల మీద ప్రయాణం చాలామందికి కష్టమేమోగానీ కొద్దిమందికి మాత్రం చాలా ఇష్టం. థియేటర్ ఆర్టిస్ట్, మోడల్, హీరోయిన్, ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న హుమా ఖురేషి ‘జేబా: యాన్ యాక్సిడెంటల్ సూపర్‌హీరో’ పుస్తకంతో రైటర్‌గా మారింది. రైటర్‌గా తన అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘ప్రపంచాన్ని కాపాడిన మహిళ కథ ఇది. సామాజిక కట్టుబాట్లకు అతీతంగా అన్ని వర్గాల వారికోసం రాసిన పుస్తకం’ అంటుంది ఖురేషి.
నవరసాలలో హాస్యరసం తనకు కష్టం అంటుంది ఖురేషి. ‘నేను రాసిన హ్యూమర్ నాకు విపరీతంగా నవ్వు తెప్పించవచ్చు. ఇతరులు అసలే నవ్వకపోవచ్చు. అందుకే హ్యూమర్ రాయడం చాలా కష్టం’ అంటుంది ఖురేషి. ఈ పుస్తకంలో కథానాయిక ‘జేబా’తో పాటు ఎన్నో క్యారెక్టర్లు ఉన్నాయి. అన్ని క్యారెక్టర్లు తనకు ఇష్టమే అని చెబుతున్న హుమా ఖురేషి రైటర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment